టీడీపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు. అయితే ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముందంటే ఈ త్యాగం వెనుక కథ వేరే వుంది. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సో, మిగిలిన ఆ పదవీ కాలానికిగాను ఇంకొకరికి ఆ అవకాశం దక్కుతుందన్నమాట. తద్వారా 'అసంతృప్తుల్ని' కొంతవరకు తగ్గించాలన్నది చంద్రబాబు ప్లాన్‌. అరరె, ఇలాంటి తెలివితేటలు చంద్రబాబుకి మాత్రమే సాధ్యమవుతాయెందుకో.! 

Image result for somireddy chandramohan reddy

టీడీపీ సీనియర్‌ నేత అయిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సొంత నియోజకవర్గం సర్వేపల్లి గత మూడు దఫాలుగా షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చేస్తోంది. ఈసారి ఎలాగైనా అసెంబ్లీకి ఎంపిక కావాలన్నది సోమిరెడ్డి ఆశ అట. కాదు కాదు, సర్వేపల్లిని ఎలాగైనా దక్కించుకోవాలన్నది చంద్రబాబు స్కెచ్‌. అందుకే సోమిరెడ్డితో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి సోమిరెడ్డిని నిలబెట్టబోతున్నారు టీడీపీ అధినేత. 

Image result for somireddy chandramohan reddy

పాపం సోమిరెడ్డి, చంద్రబాబు ఆదేశాలతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అయితే చేశారుగానీ.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేంత సీన్‌ అయితే ఆయనకు లేదు. సర్వేపల్లి ఆల్రెడీ వైఎస్సార్సీపీ ఖాతాలోకి చేరిపోయినట్లేనని చాలా సర్వేలు చెబుతున్నాయి. టీడీపీ అంతర్గత సర్వేలోనూ ఇటీవల ఇదే విషయం వెల్లడయ్యిందట. అందుకే, చంద్రబాబు ఒకింత ఎక్కువ ఫోకస్‌ ఈ నియోజకవర్గంపై పెడుతున్నారు, సోమిరెడ్డిని బరిలోకి దింపడం ద్వారా. 

మరింత సమాచారం తెలుసుకోండి: