ప్రేమికుల రోజు భారత దేశ వ్యాప్తంగా  భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రేమికులపై విరుచుకు పడుతున్నారు.  పార్కులు, థియేటర్లు ఇతర ప్రదేశాల్లో ఆరోజు ప్రేమికులు కనిపిస్తే వారికి పెళ్లి చేయడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతుంది.   ఈ నేపథ్యంలో మొన్న మేడ్చల్ లో కండ్లకోయ ఆక్సిజన్ పార్క్‌లో భజరంగ్ దళ్ కార్యకర్తలకు చిక్కి.. బలవంతపు పెళ్లి చేసుకున్న ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.

వెంటనే అప్రమత్తమైన లేక్ పోలీసులు వారిద్దరినీ కాపాడారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.  కండ్లకోయ ఆక్సిజన్ పార్క్‌లో కనిపించిన బాధిత జంటను చూసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు ఇద్దరికీ బలవంతంగా పెళ్లి చేశారు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

ఆరోజు అన్ని టివి ఛానల్స్ లో ఇదే హాట్ టాపిక్ గా మారడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.  ఘటన జరిగినప్పటి నుంచి తన కుమార్తె కనిపించడం లేదని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయిందని..తమ కూతురుని వెతికి పెట్టాలని  పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.  దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు భజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: