ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకోబోతోంది. ఏపీ మంత్రులు నారా లోకేశ్, నారాయణ రాజీనామాలు చేయబోతున్నారు.. అదేంటి ఇలాంటి కీలకమైన సమయంలో వారు రాజీనామాలు చేయడమేంటనుకుంటున్నారా.. అక్కడే వుంది అసలు విషయం.

Image result for nara lokesh and narayana

వారు రాజీనామాలు చేసేది మంత్రి పదవులకు కాదు.. ఎమ్మెల్సీ పదవులకు.. వారిద్దరూ ఎమ్మెల్సీలు అవ్వడం ద్వారానే మంత్రి పదవులు అలంకరించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ అసెంబ్లీకి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు.

Image result for nara lokesh and narayana


అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. దీని వల్ల ఆ స్థానాలు పార్టీలో టిక్కెట్లు రానివారికో.. అసంతృప్తులకో కట్టబెట్టొచ్చన్నమాట. తాము ఎలాగూ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు కనుక .. ఈ మూడు నెలలూ ఎమ్మెల్సీలు లేకపోయినా ఇబ్బంది లేదు.

Image result for nara lokesh and narayana


మరి ఏ సభలోనూ సభ్యుడు కాకుండా మంత్రి పదవి ఎలా అంటారా.. అలా ఆరు నెలలపాటు మంత్రిగా ఉండే అవకాశం ఎలాగూ రాజ్యాంగం కల్పించింది. మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని ప్రముఖ మీడియా సంస్థలో కథనాలు వచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: