రాజకీయ నాయకుడు ఇచ్చిన మాట మీద నిలబెడితే అంత ఈజీ గా ఆ నాయకుడు ని వదిలి పెట్టరు. కానీ రాజకీయాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అంత ఈజీ వ్యవహారం కాదని చెప్పాలి. అయితే ఎవరు అవునన్నా కాదన్న , ఆంధ్ర ప్రదేశ్ ప్రతి పక్ష నేత జగన్ ప్రత్యేక హోదా విషయం లో ఒక మాట మీద నిలబడ్డాడు. ఈ ఒక్క విషయం లో నే కాదు ప్రతి విషయం లో ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు.  ఎన్నికలు వచ్చేస్తున్నాయి.. ఎవరు అధికార పీఠమెక్కుతారనేది ఓటర్లు డిసైడ్‌ చేస్తారు. నేతలు అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు జంపింగ్‌ జపాంగులుగా మారిపోవడం చూస్తూనే వున్నాం. ప్రధానంగా వైఎస్సార్సీపీలో చేరుతున్న నేతలు చెబుతున్నది ఒకటే, అదే 'జగన్‌ ఒకేమాట మీద నిలబడ్తారు' అని.

Image result for jagan

టీడీపీపై రాజకీయ విమర్శలనేది వేరే అంశం. 'జగన్‌ మాట ఇస్తే తప్పరు. మాట మీదనే నిలబడ్తారు. ప్రత్యేకహోదా విషయంలో పరిస్థితులు ఎలావున్నా, జగన్‌ మాత్రం మాట తప్పలేదు. ప్రత్యేకహోదా అంశం ఇప్పటికీ సజీవంగా వుందంటే అది జగన్‌ కారణంగానే..' అని చెబుతున్నారు. పైగా, వైఎస్సార్సీపీలో చేరుతున్న నేతలంతా తమ పదవులకు రాజీనామా చేసి వస్తున్నవారే. ఇప్పుడంటే ఎన్నికల ముందర.. అనుకోవచ్చుగాక. కానీ, నంద్యాల ఉప ఎన్నికల సమయంలో శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. భవిష్యత్తులోనూ వైఎస్‌ జగన్‌ ఇదేమాట మీద నిలబడ్తారనీ, పార్టీలు మారే నేతలు ఖచ్చితంగా తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేననే సిద్ధాంతం పెట్టుకున్నామనీ వైఎస్సార్సీపీ అంటోంది.

Image result for jagan

తాజాగా ఈరోజు దాసరి జై రమేష్‌, వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడీయన. చంద్రబాబుతో పొసగక చాలాకాలంగా టీడీపీకి దూరంగా వుంటోన్న దాసరి జై రమేష్‌, టీడీపీ ఇప్పుడు ఓ సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమైపోయిన పార్టీ.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారాయన.


మరింత సమాచారం తెలుసుకోండి: