తాతకు పెట్టిన బొచ్చ తలాపినే ఉంటుంది - చంద్రబాబు విషయంలో చక్కగా ఋజువైంది అందరికి నీతులు చెప్పే శ్రీరంగడు చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ కు కూడా అతికినట్లు సరిపోతుంది.  ఎందుకంటే నాడు వైసిపి ఎమెల్యేలను ఎంపీలను కప్పదాట్లు వేయించి ఆ పార్టీకి విడాకులు ఇవ్వకుండానే లేపు కెళ్ళి ఎదురింట్లో కాపురం పెట్టిన రాజకీయం తంతే తిరిగి వచ్చిన బంతులు లాగా ఆ నాయకుని ఆయన కొడుకు ముఖానికే తగులుతున్నాయి. అయినా మా నాన్న నిప్పు అంతకు మించిన ముద్ద పప్పును నేను అంటున్నారు ప్రజలు ఎన్నుకోని ఆ యువనేత. 
సంబంధిత చిత్రం
హైదరాబాద్ లో ఓటుకు నోటు కేసులో రెడ్-హాండెడ్ గా దొరికిపోయి, బ్రీఫ్డ్-మి వీడియో ద్వారా విశ్వవిఖ్యాతి గాంచిన ఈ నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసించి ఎన్నుకొన్న ఈ నాయకుడు దశాబ్ధికాలం ఉచితంగా లభించిన ఉమ్మడి రాజధానిని వదిలేసి ఘజనీ మహమ్మద్ లా రాత్రికి రాత్రి మందీ మార్భలంతో మూటాముల్లె సర్ధుకొన ధారుణ పరాభవాన్ని దిగమింగుకొని పరువు ప్రతిష్ట కోల్పోయి అమరావతికి పారిపోయి వచ్చిన ఈ మహనీయుని చరిత్ర సమస్తం తెలుగు వారికి కరతలామలకం.  
chandrababu vs yellow media vs jagan కోసం చిత్ర ఫలితం
తెలుగుదేశం పార్టీ నుంచి వైఎసార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు తమ తమ పదవులకు రాజీనామాలు చేసే వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికే గాక ఆ పార్టీ ద్వారా సిద్ధించిన ఎంపీ పదవి కూడా రాజీనామా చేసినట్టుగా అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. అంతకు ముందు మేడా మల్లిఖార్జునరెడ్డి సభాపతి ఫార్మాట్ లో తన రాజీనామా పత్రాన్ని సమర్పించటం దాన్ని సభాపతి ఆమోదించడం జరిగిపోయాయి.  ఇక ఆమంచి కృష్ణమోహన్ తన సొంత నవోదయం పార్టీ తరఫున గెలిచారు. బట్టి ఎటైనా ఏ పార్టీలోకైనా వెళ్లే అధికారం ఆయన కే ఉంటుంది. అంటే ఆయన ఒక స్వతంత్ర లేదా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మాత్రమే. 
chandrababu vs yellow media vs jagan కోసం చిత్ర ఫలితం
అయితే వీళ్లే కాదు, తన పార్టీ లోకి ఎవరు రావాలన్నా, వాళ్లు వాళ్ళ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఆ పార్టీ తరఫున లభించిన పదవులకు రాజీనామాలు చేసి రావాలని వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి షరతు విధిస్తున్నారు. అందుకే శిల్పా చక్రపాణి రెడ్డి లాంటి వాళ్లు కూడా అదే విధంగా రాజీనామాలు చేసే వైసీపిలోకి చేరిపోయిన విషయం అందరికీ తెలిసిందే. తన రాజకీయ పార్టీలో చేరే వ్యక్తుల విషయంలో వైఎస్ జగన్మోహనరెడ్డి పూర్తి నైతికతకు కట్టుబడే ఉంటూ వస్తున్నారు. ఇచ్చినమాటకు కట్టుపడి ఉంటూ తీసుకున్న నిర్ణయం విషయంలో మడమ తిప్పకుండా ఉండటం ప్రస్తుతానికి ఆయనకు పార్టీకి ప్రజల్లో విశ్వాసం ఇనుమడింపజేస్తుంది. 
chandrababu vs yellow media vs jagan కోసం చిత్ర ఫలితం
సుధీర్ఘ రాజకీయ అనుభవంతో వర్ధిల్లే తెలుగుదేశం అధినేత మాత్రం మడమ తిప్పడంలో నాలుక మడతేయటంలో సిద్ధహస్తుడు. మడం ఉన్నదే తిప్పటానికి-నాలుక ఉన్నదే మడతేయటానికి అనే కొత్త అనైతిక రాజకీయం ఆయన సిద్ధాంతమే కాదు, విలువలు కూడా! ఇరవై మందికి పైగా ప్రతిపక్ష వైసిపి ఎమ్మెల్యేలను 'వ్యభిచారికి లేని సిగ్గు మీకేల' అంటూ వారి చేత వైసిపికి, ఆ పార్టీ ద్వారా దక్కిన పదవులకు రాజీనామాలు కూడా చేయకుండా ఎగరేసుకు పోయి తన పార్టీలో చేర్చుకున్నారు. అంతే కాదు వారిలో నలుగురికి బాహాటంగా మంత్రి పదవు లు కూడా ఇచ్చిన వ్యక్తి నిప్పు నారా చంద్రబాబు నాయుడు. ఆయనకు సరైన జోడీ ఆయన శాసనసభ సభాపతి. 
chandrababu vs yellow media vs jagan కోసం చిత్ర ఫలితం
చంద్రబాబు రాజకీయ చరిత్ర సమస్తం కుటిల కుయుక్తుల సమన్వితం, సమన్వయం. అలాంటి చేరికల తరుణంలో,  దాన్నే అదో చంద్రబాబు చాణక్యంలాగా రాజకీయ విజయంలాగా వార్తలు వండి వార్చింది తెలుగు దేశం అనుకూల పచ్చ మీడియా పచ్చిగా.  కులాభిమానం ఉంటే ఉండొచ్చు.  అయితే తారస్థాయిలో సిగ్గుమాలిన తనం ఎవరికీ ఆమోదయోగ్యం గాదు. ఇంత నిశ్శిగ్గుగా సమాధించే మీడియా వ్యాపారం కంటే 'బ్రతుకీడ్చటానికి  ఆ వ్యభిచారం చేసే వారకాంతలు నయం'  అంటున్నారు జనం బహిరంగం గానే. 
సంబంధిత చిత్రం
కులాన్ని సమర్ధించే  'పచ్చి పచ్చ మీడియా' ఒక్క తన సామాజికవర్గం తోనే బ్రతుకీడ్చిందా! ప్రజలు కులాభిమానంతో ఆ దినపత్రికలకు పాఠకులు కాలేదు. ఆ పత్రికలు గతంలో అందించిన సాంస్కృతిక సాంప్రదాయ గుణాత్మక విలువలకు పట్టం కట్టారు తరతమ బేధం లేకుండా! కాని నేడు అదే పత్రికల్లో తమ స్వకులాభిమాన గరళాన్ని అశేష తెలుగు జనావళి శిరస్సులపై కుంభాభిషేకం చేస్తుండగా - జనం గుర్తించారు. అది ఇప్పుడు ఆ గరళ ప్రయోజనమే ఆ మీడియాకు కూడా 'బూమరాంగ్' అవనుంది.   
chandrababu vs yellow media vs jagan కోసం చిత్ర ఫలితం
కారణం అలాంటి పచ్చమీడియా ఇప్పుడు — నేతలు టిడిపి నుండి వైసిపి లోకి పార్టీలు మారడం అనైతికం--- అంటూ వార్తల పిండి వంటలు వడ్డిస్తుంది. నేతలు రాత్రికి రాత్రి పార్టీలు మారు తున్నారని వాపోతోంది! మరి వైసిపి తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలకు నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు, తెలుగు దేశానికి, తెలుగు దేశం అనుకూల మీడియాకు అదే నైతికత నాడెందుకు గుర్తుకు రాలేదు? అంటున్నారు.
kamma media కోసం చిత్ర ఫలితం

సంబంధిత చిత్రం

ఇప్పుడు నిజాయతీగా నేతలు తమ టిడిపి సభ్యత్వానికి దానితో లభించిన పదవులకు సైతం రాజీనామాలు చేసి బయటకు వెళ్తుంటే, వీరు నైతికత గురించి జనాలకి తమ పత్రికల ద్వారా శ్రీరంగ నీతులు చెపుతున్న (అ) నైతికత వీరి స్వంతం!

chandrababu vs yellow media vs jagan కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు హైదరాబాద్ లోని తెలుగువారు వారు చదివే దినపత్రికలను బట్టి, ఆ పాఠకుల పార్టీ ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పచ్చపత్రికలు క్రమం తప్పకుండా చదివేవార్ని "మీరు కమ్మవారా! టిడిపికి చెందిన వారా!" అని అడుగు తున్నారు, అదీ సాధారణ సమాచాం అడిగినట్లు. 

kamma media కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: