త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలు వైసిపి మరియు టిడిపి పార్టీ ల మధ్య మాటల తూటాలు భారీ స్థాయిలో పేలుతున్నాయి. ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు భారీ బహిరంగ సభల్లో ఇటీవల టిడిపి పార్టీ నుండి వీడిన నాయకులపై విరుచుకుపడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేస్తున్నారు.

Image result for lokesh

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనేక విధాలుగా ఇబ్బందులపాలు చేసిన కేంద్ర ప్రభుత్వం పట్ల చంద్రబాబు చాలా అసహనాన్ని ఇటీవల జాతీయ స్థాయిలో ఢిల్లీలో దీక్ష రూపంలో చూపించిన విషయం మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న క్రమంలో మంత్రి నారా లోకేష్ 2019లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఆంధ్రాలో ఎగురుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Image result for lokesh

రానున్న ఎన్నికల్లో ఏపీ మొత్తం మీద దాదాపుగా 150 తప్పకుండ గెలుస్తామని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడమే లేదా అనేది మరో నెల రోజుల్లో చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటాడని లోకేష్ అన్నారు. ఇటీవల కృష్ణ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన లోకేష్ రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనీ ఆశగా ఉందని అన్నారు.

Image result for lokesh

అంతేకాకుండా తానూ పోటీ చేసేది లేనిది అనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని లోకేష్ తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పార్టీల వలసల కోసం స్పందించిన ఆయన… నాయకుల పనితీరు, ప్రజల్లో వారి ఆధారనని దృష్టిలో పెట్టుకుని టికెట్లు కేటాయించడం జరుగుతుందని తేల్చిపారేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: