వైస్సార్సీపీ పార్టీ లోకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు , ఎంపీలు పార్టీ మారుతుండటం టీడీపీ ని బాగా కలవర పెడుతుంది. ఎవరు ఎప్పుడు వైస్సార్సీపీ ఖండువా కప్పుకుంటారో అర్ధం కావటం లేదు. కీలక నేతలు ఒక్కరొక్కరు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే కీలకమైన కడప జిల్లాలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరగా.. మొన్న ప్రకాశంలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి... నిన్న అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరిపోయారు. అయితే  మరి కొందరు ఇదే బాటలో నడవనున్నారని తెలుస్తోంది.


వలసలను ఆపడానికి టీడీపీ చివరికి ఆ పని చేస్తుంది ...!

ఈ జాబితాలో నెక్ట్స్ ఎవరు అనే అంశం గురించి ఆసక్తిదాయకమైన చర్చ జరుగుతూ ఉంది. ప్రత్యేకించి కోస్తాంధ్ర నుంచి తదుపరి చేరికలు ఉండబోతున్నాయని సమాచారం.  ఈ నేపథ్యంలో వినిపిస్తున్న పేర్లు.. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి. వీళ్లిద్దరూ వైసీపీలో చేరడం గురించి ముందు నుంచినే ఊహాగానాలున్నాయి.  ఇప్పుడు  అవే నిజం కాబోతున్నాయని సమాచారం. మోదుగల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం లాంఛనమే అని టాక్. అలాంటిదేమీ లేదని మీడియాకు లీకులు ఇస్తున్నా.. ఈ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. 


జగన్ పార్టీ లోకి టీడీపీ నేతలు అందుకే జంప్ అవుతున్నారా ..!

 ఇక వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీ సీటును త్యాగం చేయడానికి రెడీ అయితే.. మాగుంట వైసీపీలోకి చేరడానికి రెడీ అంటున్నారట. వైవీ సుబ్బారెడ్డికి జగన్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని.. మాగుంట చేరితే టికెట్ ఆయనకే అని అంటున్నారు. ఈ పంచాయితీని జగన్ ఏం తేలుస్తారో చూడాల్సి ఉంది. మాగుంట వైసీపీలోకి చేరడానికి… ఒంగోలు ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులుగా ఎవరెవరైతే బాగుంటుందో అనే జాబితాను  కూడా రెడీ చేసుకున్నట్టుగా సమాచారం! 


మరింత సమాచారం తెలుసుకోండి: