వైస్సార్సీపీ పార్టీ లోకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు , ఎంపీలు పార్టీ మారుతుండటం టీడీపీ ని బాగా కలవర పెడుతుంది. ఎవరు ఎప్పుడు వైస్సార్సీపీ ఖండువా కప్పుకుంటారో అర్ధం కావటం లేదు. కీలక నేతలు ఒక్కరొక్కరు పార్టీని వీడుతున్నారు. అయితే జగన్ వచ్చే నేతలకు డెడ్ లైన్ విధించి తన దైనా మార్క్ చూపిస్తున్నాడు. ఎక్కడైనా అధికార పార్టీ నుంచి నేతలు వస్తుంటే ప్రతి పక్ష పార్టీ ఓపిగ్గా వలసలు ను ప్రోత్సహిస్తుంది. అయితే జగన్ ఇలా డెడ్ లైన్ పెట్టడం చర్చనీయాంశం అయ్యింది. 


ఆ ఒక్క గుణం జగన్ ను మంచి లీడర్ గా నిలబెట్టింది ..!

మొన్నటికి మొన్న మేడా - ఆమంచి - నిన్న అవంతి - దాసరి జై రమేష్.. ఇలా టీడీపీ లీడర్లంతా జగన్ ని కలుస్తున్నారు. పార్టీలో చేరిపోతున్నారు. ఇన్నాళ్లూ లేనిది ఇంత సడన్గా ఎందుకు జపాంగ్ లు స్టార్ట్ అయ్యాయి అంటే దానికి కారణం జగన్ పెట్టిన డెడ్ లైనే నట.  ఎన్నికల్లో ప్రతీ పార్టీకి సీట్ల సర్దుబాటు తప్పదు. కొత్తగా పార్టీలోకి వచ్చేవారిని చేర్చుకుని వారికి వారి అడిగిన స్థానాల్లో సీటు ఇవ్వాలి.


ఆ ఒక్క గుణం జగన్ ను మంచి లీడర్ గా నిలబెట్టింది ..!

అందుకే.. ఎవరైనా వచ్చేవాళ్లు ఉంటే.. ఫిబ్రవరి 20లోపు రావాలని జగన్ ఆల్టిమేటమ్ జారీ చేశారట. 20 లోపు వచ్చేవారికే సీట్ల కేటాయింపునకు సంబంధంచి హామీ ఉంటుందని.. తర్వాత వచ్చేవారు పార్టీలో చేరినా.. సీట్లు వచ్చే అవకాశాలు మాత్రం ఉండవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట. దీంతో.. అందరూ హాడావుడిగా జగన్ దగ్గరకు వెళ్లి వాలిపోతున్నారు.  ఇప్పటికే ముగ్గురు లీడర్లు వైసీపీలోకి వెళ్లారు. 20 లోపు కనీసం మరో 15 మంది లీడర్స్ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని రాజకీయ వర్గాలంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: