ఉగ్రవాదుల దాడితో దేశం మొత్తం ఒక్క సారిగా అట్టడుకి పోయింది. దేశం కోసం ప్రాణాలను అర్పిస్తున్న జవానులు చనిపోవడం తో దేశ ప్రజలు ఆక్రోశంతో ఉన్నారు.  42 మంది జవాన్లు మృతికి కారణమైన తీవ్రవాదంపై నరేంద్ర మోడీ ఎలా స్పందించాల్సి వుంది.? స్పందించకనేం, మాటల్లో బహు గొప్పగా స్పందించేశారు. తీరా ఈ అంశంపై కీలకమైన అఖిలపక్ష భేటీ జరిగితే, ఆ మీటింగ్‌కి నరేంద్ర మోడీ డుమ్మా కొట్టేశారు. ప్రధాన మంత్రి హాజరు కానప్పుడు అఖిలపక్ష సమావేశంలో అర్థమేముంటుంది.?

Image result for narendra modi

విపక్షాలు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే, నరేంద్ర మోడీ ఆ మీటింగ్‌కి డుమ్మా కొట్టారా.? అంటే, అవుననే అంటున్నాయి విపక్షాలు. ఇలాంటి సందర్భాల్లో విపక్షాలు రాజకీయం చేయబోవనే ఆశిస్తున్నాం..' అని నరేంద్ర మోడీ సహా బీజేపీ నేతలంతా బహు గొప్పగా సెలవిచ్చారు. కానీ, రాజకీయం మొదలెట్టింది సాక్షాత్తూ నరేంద్ర మోడీనే. లేకపోతే, అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరు కాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? తీవ్రవాద నిర్మూలన కోసం నరేంద్ర మోడీ సర్కార్‌ గత నాలుగున్నరేళ్ళలో ఏం చర్యలు తీసుకుందో చెప్పాలి, ఇప్పుడు ఈ సందర్భంలో ఎలా స్పందిస్తుందో వివరించాలి.

Image result for narendra modi

కానీ, 'రక్తం మరిగిపోతోంది' అంటూ వేదికలెక్కి ప్రసంగాలు చేయడం మీదున్న శ్రద్ధ, దేశ ప్రజలకు సమాధానం చెప్పడంలో వుండదు కదా.! దటీజ్‌ మోడీ. పెద్ద పాత నోట్ల రద్దు సమయంలోనే, తీవ్రవాదం అంతమైపోతుందంటూ ప్రగల్భాలు పలికిన మనిషి.. ఆ పెద్ద నోట్ల రద్దు ప్రయోజనాలపై ఇప్పటికీ పెదవి విప్పరాయె. అలాంటిది, తీవ్రవాదం గురించి ఆయనేదో చిత్తశుద్ధితో వ్యవహరిస్తారని ఎలా ఆశించగలం.?

మరింత సమాచారం తెలుసుకోండి: