ఆయన పూసపాటి వంశస్థుడు. శతాబ్దాలుగా పేరు మోసిన వంశీకుడు. రాజకీయాల్లో దశాబ్దుల అనుభవం కలిగిన నేత. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నేత. ఆయనే పూసపాటి అశోక్ గజపతి రాజు. కేంద్ర మంత్రిగా కూడా ప్రధాని మోడీ మెప్పు పొందిన నాయకుడు. ముక్కుసూటితనం, నిజాయతీ ఆయనకు పెట్టని అభరణాలు.


బాబుపై  గుస్సా :


అటువంటి రాజుగారు ఇపుడు చంద్రబాబుపై గుస్సా అవుతునారని టాక్. తనకు టీడీపీలో సరైన ప్రాధ్యాన్యత లేకపోవడం పట్ల చాలాకాలంగా ఆయన మధన పడుతున్నారు. ఏకంగా పాలిట్ బ్యూరో మీటింగుకు డుమ్మా కొట్టడంతో అది బయటపడిపోయింది. దీనికి ముందు విజయనగరంలో  జరిగిన సీఎం టూర్లోనూ ఆయన కనిపించలేదు. తన సొంత జిల్లాలో భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపనకు మాజీ పౌర విమానశాఖా మంత్రిగా రావాల్సిన రాజు గారు రాలేదంటేనే ఏదో జరిగిందని తెలుస్తోంది. ఇక తాజా పరిణామాలతో రాజు గారు ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది.


జనతా పార్టీ నుంచి :


నిజానికి రాజు గారి రాజకీయ అరంగేట్రం టీడీపీ నుంచి  కాదు. జనతా పార్టీ నుంచి 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు కూడా అదే టైంలో తొలిసారి ఎమ్మెల్యే. ఇక జనతా పార్టీ ప్రాభవం మసకబారడం, 1983లో అన్న నందమూరి టీడీపీని పెట్టడంతో అందులో చేరిపోయారు. అప్పటి నుంచి ఆయన టీడీపీలో కీలకంగా ఉన్నారు. కాంగ్రేసేతర రాజకీయాలను ఇష్టపడే రాజు గారికి టీడీపీ కాంగ్రెస్ తో అంటకాగడం ఇష్టం లేదంటారు. దానికి తోడు పార్టీలో కూడా జరుగుతున్న పరిణామాలు మింగుడుపడడం లేదని టాక్. ఒకపుడు విజయనగరం జిల్లాలో ఒకే రాజు గారు, ఇపుడు బొబ్బిలి రాజులు, శత్రుచర్ల రాజులు, లేటెస్ట్ గా కురుపాం రాజులు. అందరినీ చేర్చుకుంటున్న చంద్రబాబు సీనియర్ నాయకుడు అశోక్ కి కనీసం వీసమెత్తు కూడా విలువ ఇవ్వలేదుట. ఎటువంటి సమాచారం చెప్పడంలేదట.


బీజేపీలో చేరుతారా :


ఇక రాజు గారు చాలా అసంత్రుప్తిగా ఉన్నారు. ఆ విషయాన్ని ఆయనే చెప్పుకున్నారు. పార్టీ మీద పూర్తి  సంత్రుప్తిగా లేనని అనడం విశేషం. ఈ మధ్య విజయనగరం జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనకు రాజు గారు వెనక నుంచి మద్దతు ఇచ్చారని అంటారు. ఆయన పనితీరు పట్ల మోడీ ఎంతో హ్యాపీగా ఫీల్ అవడమే కాదు. తమతో కలసి రావాలని కోరారని అప్పట్లో వార్తలు  వినిపించాయి. మరి టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూసిన తరువాత ఈ సీనియర్ నేత పార్టీకి షాక్ ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: