ఏ పార్టీ అధినేత కు అయినా పార్టీ లో అసమ్మతి సెగలు , రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడం చాలా కష్టం. ఇప్పటికే 40 ఏళ్ళు అనుభవం ఉన్న చంద్ర బాబు పార్టీ లోని ఎమ్మెల్యేలను ఇప్పుడు కంట్రోల్ చేయలేక పోతున్నాడు. అయితే జగన్ మాత్రం సాఫీగా తేల్చేస్తున్నాడు. ఇప్పడూ టీడీపీ కి రాయలసీమలో టికెట్‌ పంచాయితీలు ఎక్కువగా ఉన్న జిల్లా కర్నూలు ఇక్కడ నంద్యాల ఎంపీ, ఆళ్లగడ్డ, నంద్యాల అసెంబ్లీ.. సీట్ల విషయంలో ప్రతిష్టంభన నెలకొని ఉంది. ఈ సీట్ల విషయంలో ఆశావహుల మధ్యన రచ్చలు తీవ్రస్థాయికి వెళ్లాయి. బహిరంగ సవాళ్లకు కూడా సదరు నేతలు వెనుకాడటం లేదు.

Image result for chandra babu

ఇక కర్నూలు ఎమ్మెల్యే టికెట్‌ విషయంలో పోటీ ఉంది. కోట్ల వర్గం ఎంట్రీతో అక్కడ పోరు త్రిముఖంగా మారింది. కోట్ల వర్గం ఎంట్రీ ఇస్తే.. డోన్‌ సీటు  విషయంలో, ఆలూరు సీటు  విషయంలో కూడా రచ్చలు తీవ్ర స్థాయికి వెళ్లేలా ఉన్నాయి. కర్నూలు ఎంపీ టికెట్‌ను మాత్రం కోట్ల వర్గానికే ఖరారు చేసేలా ఉన్నారు.  చిత్తూరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారారు. వారిని మార్చాలనే యోచనలో ఉన్నారట చంద్రబాబు నాయుడు. తిరుపతి ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్‌ ఇచ్చేది లేదంటున్నారట. శ్రీకాళహస్తి కథా ఇలానే ఉంది. అక్కడ బొజ్జల కుటుంబానికి టికెట్‌ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరని ప్రచారం జరుగుతోంది. మరొకరిని తెరపైకి తెస్తున్నారు. ఆ రెండు వర్గాలూ టికెట్‌ విషయంలో పోటీ పడుతున్నాయి.

Image result for chandra babu

నగరి టికెట్‌ పరిస్థితీ ఇలానే ఉంది.ఇక్కడ వర్గాలుగా విడిపోయి నేతలు పోటీలు పడుతున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో వర్గపోరు తీవ్రంగా ఉంది. అదే జిల్లాకు సంబంధించిన ఎంపీ నిమ్మల కిష్టప్ప ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్‌ మీద కన్నేశాడు. ఫలితంగా పెనుకొండ, పుట్టపర్తి నియోజకవర్గాలు వర్గాలు ఏర్పడ్డాయి. కడపజిల్లాలోనూ తేల్చాల్సిన పంచాయితీలున్నాయి. ఇలాంటి నేఫథ్యంలో చంద్రబాబు నాయుడు  వీటికి సంబంధించి ఎప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తారు.. అభ్యర్థులను ఎప్పుడు  ఖరారు చేస్తారనేది ఆసక్తిని రేపుతోంది. అభ్యర్థులు ఖరారు అయితే.. అప్పుడే  అసలు మజా మొదలయ్యే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: