పాపం లోకేష్ ట్విట్టర్ లో ఏది మాట్లాడిన ట్రోలింగ్ కు గురవుతూనే ఉంటాడు. నెటిజన్స్ అంత ఈజీ గా లోకేష్ ను వదిలి పెట్టడం లేదు. ఎన్టీఆర్-మహానాయకుడు ట్రయిలర్ ను పెడుతూ "బాలా మామయ్య నటన నభూతో.." అంటూ ట్వీట్ చేశారు లోకేష్. అంతే ఒక్కసారిగా నెటిజన్ సమాజం చినబాబుపై విరుచుకుపడింది. మీ బాలా మామ తెరపై నటిస్తే మీ నాన్న చంద్రబాబు నిజజీవితంలోనే నభూతో రేంజ్ లో నటిస్తున్నారంటూ కామెంట్లు ఊపందుకున్నాయి. మరికొందరైతే, లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రయిలర్ చూసిన తర్వాత ఈ ట్వీట్ పెడితే బాగుండేదని రియాక్ట్ అయ్యారు.

Image result for lokesh

ఫస్ట్ పార్ట్ కు కూడా ఇలానే ట్వీట్ చేస్తే అది అట్టర్ ఫ్లాప్ అయిందని, కనీసం మీ మామ మీద దయతో రెండో భాగంపై ట్వీట్ చేయడం ఆపుకోవాలని మరికొందరు లోకేష్ కు సలహా ఇచ్చారు. లోకేష్ ట్వీట్ చేస్తే రాజమౌళి సినిమా కూడా డిజాస్టర్ అవుతుందంటూ మరో వర్గం సెటైర్లు. మీరే వెన్నుపోటు పొడిచి మీరే నభూతో అంటూ మెచ్చుకోవడం ఏమాత్రం బాగాలేదంటూ సోషల్ మీడియాలో లోకేష్ కు వ్యతిరేకంగా పోస్టులు పడుతున్నాయి.

Image result for lokesh

"నా మొత్తం జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు వాడిని (చంద్రబాబు) నేను నమ్మడం." లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రయిలర్ లోని ఈ డైలాగ్ ను క్లిప్ చేసి లోకేష్ కు ట్యాగ్ చేస్తున్నారు నెటిజన్లు. మీ తండ్రి చేసిన మోసానికి ఎన్టీఆర్ బలైతే, నువ్వు ఇప్పుడు ఫ్రెష్ గా దానిపై ఆయింట్ మెంట్ పూస్తున్నావా అంటూ కాస్త గట్టిగానే తగులుకున్నారు. ఓవైపు ట్రయిలర్ అస్సలు బాగాలేదంటూ కామెంట్స్ పడుతుంటే మరోవైపు లోకేష్ ఇలా నభూతో అంటూ ట్వీట్ పెట్టేసరికి జనాలు తట్టుకోలేకపోయారు. అందుకే ఎన్నడూలేని విధంగా లోకేష్ పై నెట్ లో భారీ స్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: