ఇటీవల అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు ప్రజాప్రతినిధులు వైసీపీలో చేరారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఒకరు కాగా, మరొకరు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్! అధికార పార్టీ నుంచి వచ్చే లీడర్లందరినీ జగన్ చేర్చుకుంటున్నారు. ఎవర్నీ కాదనకుండా కండువా కప్పేస్తున్నారు. అయితే ఈ విషయంలో జగన్ ఆచితూచి అడుగేయకపోతే కొన్ని చోట్ల ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పుడు ఆమంచి, అవంతి వ్యవహారంలో ఒక ప్లస్, మరొక మైనస్ ఉన్నాయి.

Image result for jagan

ఔనన్నా కాదన్నా ఆమంచి కృష్ణమోహన్ సీట్ మళ్లీ గ్యారెంటీ.! చీరాలలో ఆమంచికి ఉన్న పట్టు అలాంటింది. ఆమంచి మళ్లీ గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం అనే ధీమా అందరిలోనూ ఉంది. ఈ విషయం టీడీపీకి కూడా తెలుసు. అందుకే ఆమంచిని వైసీపీలోకి వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించింది టీడీపీ. కానీ ఆమంచి యూటర్న్ తీసుకోకుండా నేరుగా వెళ్లి జగన్ తో కలిసిపోయారు. ఆమంచి కూడా టీడీపీ కంటే వైసీపీలో తనకు బెటర్ ప్లేస్ మెంట్ దక్కుతుందనే ఆలోచనలోనే జగన్ చెంతకు వెళ్లారు తప్పితే టీడీపీలో ఉంటే ఓడిపోతాను, వైసీపీకి వెళ్తే గెలుస్తాను అనే ఆలోచనతో కాదు. ఎందుకంటే ఆమంచికి తెలుసు తాను పార్టీతో సంబంధం లేకుండా గెలవగలనని..! సో.. ఆమంచి చేరికతో జగన్ ఖాతాలో ఓ ఎమ్మెల్యే సీటు ఖాయమైనట్లే.. కాబట్టి ఆమంచి చేరిక జగన్ కు కచ్చితంగా ప్లస్సే..!!

Image result for amanchi krishna mohan

అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరారు.. అవంతి వైసీపీలో చేరికకు, ఆమంచి చేరికకు చాలా తేడా ఉంది. తనకు మరింత మెరుగైన స్థానం దక్కుతుందని ఆమంచి భావించి వైసీపీలో చేరారు. కానీ అవంతి శ్రీనివాస్ మేటర్ అది కాదు. టీడీపీలో టికెట్ దక్కడం లేదని భావించి జగన్ గూటికి చేరారు. మళ్లీ ఎంపీగా పోటీ చేసే అవకాశం లేకపోవడం, ఎమ్మెల్యేగా వెళ్దామంటే తను కోరుకున్న సీటు వచ్చే గ్యారేటీ రాకపోవడం.. లాంటి కారణాలతో అవంతి వైసీపీలో చేరారు. ఆమంచి లాగా అవంతి శ్రీనివాస్ కు వ్యక్తిగత ఇమేజ్ ఏమీ లేదు. ఈ నేపథ్యంలో అవంతిని చేర్చుకోవడం ద్వారా పార్టీలో ఎంతోకాలంగా కొనసాగుతున్నవారి నుంచి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముంది. కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకోవచ్చనే ఆలోచన కూడా అవంతితో పెద్దగా సాధ్యం కాకపోవచ్చు. సో.. అవంతి చేరికమాత్రం జగన్ కు పెద్దగా లాభించకపోవచ్చు.

Image result for avanthi srinivas

ఎన్నికల ముంగిట పార్టీ మారేవాళ్లు చాలా కామన్. ఇందులో వ్యక్తిగత ఇమేజ్ కోసం వచ్చే వాళ్లు కొందరైతే, టికెట్లు రాక, ఏ పార్టీ టికెట్ ఇస్తామంటే ఆ పార్టీలో చేరిపోదాం అనుకుని చేరే వాళ్లు మరికొందరు. అయితే ఎవర్ని చేర్చుకుంటే పార్టీకి లాభం చేకూరుతుంది, ఎవరు లాయల్ గా తమతో ఉంటారు.. లాంటి అంశాలను పార్టీ అధిష్టానం బేరీజు వేసుకోవాలి. లేకుంటే మొదటికే మోసం వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: