ఏపీ రాజకీయాల్లో వైసీపీ దూకుడు కొనసాగుతోంది. టీడీపీ నుంచి వివిధ స్థాయిల్లో నాయకులు వైసీపీలో చేరుతున్నారు. వైసీపీ దూకుడు చూసిన టీడీపీ డిఫెన్సులో పడింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేసింది.



నిన్న జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్ లో ఇదే అంశంపై వాడి వేడిచర్చ జరిగింది. అయితే ఏపీ పాలిటిక్స్ ఇంత రంజుగా ఉన్న సమయంలో జగన్ లండన్ పర్యటన నిర్ణయం ఆ పార్టీలో వారిని షాక్ కు గురి చేస్తోంది. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

లండన్ లో విద్యనభ్యసిస్తున్న తన కూతురును చూసి వచ్చేందుకు నాంపల్లి కోర్టు ఆయనకు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఎన్నికలకు ముందు అది కూడా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు జగన్ విదేశీ పర్యటనకు వెళుతుండటాన్ని క్యాష్ చేసుకోవాలని చంద్రబాబు టీమ్ ప్లాన్ చేసుకుంటోంది.



వైసీపీలోని చిన్నాచితకా లీడర్లనైనా సరే ఆకర్షించి తమ పార్టీ నుంచి సాగే వలసల జోరుకు అడ్డుకట్టే వేయాలని టీడీపీ భావిస్తోంది. జగన్ లండన్ టూర్ ప్రారంభంకాగానే.. ఏపీలో మైండ్ గేమ్ ప్రారంభించాలని.. పొలిట్ బ్యూరోలో చర్చించారట. చాణక్యుడిగా పేరున్న చంద్రబాబుకు ఈ పది రోజుల టైమ్ చాలని.. పరిస్థితిని టీడీపీ వైపు ఈజీగా మలిచేస్తారని టీడీపీ నాయకులు ధీమాగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: