విశాఖ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు గత ఆరేళ్ళుగా కంటిన్యూగా మినిస్టర్ గా కొనసాగుతున్నారు. ఆయన కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ మంత్రి వర్గంలో మంత్రిగా 2012లో చేరారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మళ్ళీ మంత్రి అయ్యారు. ఇలా విశాఖ జిల్లాలో సుదీర్ఘకాలం కంటిన్యూస్ గా మంత్రిగా కొనసాగిన రికార్డ్ ని గంటా కొట్టేశారు. 


పెద్ద కుర్చీ మీదకే :


ఇక మంత్రి గంటా రాజకీయం చూస్తే 1999లో తొలిసారి అనకాపల్లి నుంచి టీడీపీ తరఫున ఎంపీగా నెగ్గారు. ఆ తరువాత 2004లో చోడవరం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2009లో ప్రజారాజ్యం నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన తరువాత మంత్రి అయిపోయారు. మళ్ళీ టీడీపీతోనే ఆయన రాజకీయ ప్రయాణం సాగించారు. మంత్రి పదవి కోసం ఏకంగా రెండు పార్టీలు మార్చి ముచ్చట తీర్చుకున్న గంటా ఇపుడు తన సీనియారిటీని, అంగబలం, అర్ధబలం చూసుకుని ఏకంగా పెద్ద కుర్చీకే గురి పెట్టారని ఆయన నిన్నటి మిత్రుడు అవంతి శ్రీనివాసరావు చెబుతున్నారు ఇపుడు గంటా లక్ష్యం  ముఖ్యమంత్రి పీఠం. నిజంగా  ఇది షాక్ ఇచ్చే న్యూస్. దాన్ని ఎవరో చెబితే నమ్మలేకపోవచ్చు కానీ ఆయన నేస్తం అవంతి శ్రీనివాసరావు చెప్పడంతోనే నమ్మబుద్ధి  వేస్తోంది.


అదేనా ధీమా :


గంటా సీఎం సీటు కోసం స్కెచ్ బాగానే వేశారా. ఆయన అనుకున్నది జరిగితే ఆ సీటు కైవశం అవుతుందా. అందుకేనా వైసీపీలోకి వెళ్ళిన అవంతి చినబాబు లోకేష్ ని హెచ్చరించింది. ఇదంతా చూస్తూంటే మాస్టర్ ప్లాన్ ఏదో ఉందనిపిస్తోందని అంటున్నారు. ఇపుడు ఏపీలో కాపుల రాజకీయం ఓ రేంజిలో ఉంది. మళ్ళీ టీడీపీ వచ్చినా, లేక వైసీపీ వచ్చినా కమ్మ, రెడ్డి మాత్రమే సీఎం లు అవుతారు. ఒకవేళ ఈ రెండు పార్టీలకు మెజారిటీ రాకపోతే అపుడు రంజైన రాజకీయం స్టార్ట్ అవుతుంది. అపుడు గంటా లాంటి మూడవ వ్యక్తికి అవకాశం వస్తుందనుకోవాలేమో.


సరిగ్గా ఈ రకమైన ఆలోచనలు మంత్రి గారికి  వచ్చాయని తెలుసుకున్న అవంతి శ్రీనివాసరావు లోకేష్ ని హెచ్చరిస్తున్నారనుకోవాలేమో . ఏది ఏమైనా మంత్రి గంటా మామూలు  రాజకీయ నేత కాదంటారు. మంత్రి కావాలన్న కసితో పార్టీలెన్నో మార్చిన ఆయన ముఖ్యమంత్రి సీటు మీద గురి పెట్టారంటే అది ఏపీలో కొత్త రాజకీఅయానికి తెర తీసినట్లే మరి. అవంతి శ్రీనివాసరావు పోతూ పోతూ ఈ గుట్టు బయట పెట్టేశారు. ఇపుడు టీడీపీలో, ప్రత్యేకించి లోకేష్ లో ఎలాంటి రియాక్షన్ ఉంటుందో మరి



మరింత సమాచారం తెలుసుకోండి: