ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఒట్లు వేయించుకుని చెక్కులు ఇస్తున్న తీరుపై పలువిమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి  దివంగత ఎన్టిఆర్ సహధర్మచారిణి శీమతి లక్ష్మీపార్వతి సంచలన విషయం చెప్పారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు ఓట్టువేసి, ఆ తర్వాత దానిని ఎలా ఉల్లంఘించాఓ ఆ  విషయం  వివరించారు. 
Chandrabaabu  Lakshmi Parvati కోసం చిత్ర ఫలితం
1993 కర్నూలు ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఓటమికి చంద్రబాబే ప్రయత్నించారని - ఫిర్యాదులు వస్తే ఎన్టిఆర్ తమ పార్టీలోనే ఉండవద్దని చంద్రబాబుకు చెప్పారన్న విషయాన్ని ఆమె వెల్లడించారు. దాంతో ఎన్టిఆర్ ను తిరిగి ప్రసన్నం చేసుకోవడానికి ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు ద్వారా తన వద్దకు వచ్చి బతిమలాడారని ఆమె చెప్పారు. ఆ సందర్భంగా చంద్రబాబు తనను అత్తా! అని కూడా సంభోదించారని ఆమె అన్నారు.
Chandrabaabu  Lakshmi Parvati కోసం చిత్ర ఫలితం
ఆ సందర్భంగా పార్టీకి ఎలాంటి ద్రోహం చేయనని ఆయనను ఒట్టు వేయాలని కోరానని, అందుకు ఆయన సమ్మతించారని, "అత్త అయినా! అమ్మ అయినా మీరే కదా!"  అని అంటూ కొడుకు మీద ప్రమాణం చేసి చెబుతున్నానని, ఎన్టిఆర్ కు నష్టం చేయనని ఒట్టేసి చెప్పారని లక్ష్మిపార్వతి వెల్లడించారు. ఇది తన కుమారునిపై ప్రమాణం చేసి చెబుతున్నానని ఆమె చెప్పారు. చంద్ర బాబు దీనిని కాదనగలరా! అని ఆమె సవాల్ చేశారు.


కాని ఆ తర్వాత చందబాబు స్వార్ధం కోసం ప్రమాణాలు, ఒట్లు అన్నింటిని తీసి పక్కన బెట్టేసి స్వయంగా మామ అయిన ఎన్టిఆర్ కే వెన్నుపోటు పొడిచారని ఆమె చెప్పారు. అందు వలన ఇప్పుడు చందబాబు నాయుడు నాయకత్వం లోని తెలుగు దేశం పార్టీ వాళ్లు ఓట్లను వేయించుకోవటానికి వేసే ఓట్లను ప్రమాణాలను అసలు నమ్మనవరం లేదని, పైగా వాళ్ళు ఇచ్చేది ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన ప్రభుత్వదనమని, ఆమె అన్నారు.
Chandrabaabu  Lakshmi Parvati కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: