తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత నందమూరి తారక రామారావు మీద ఏపి ముఖ్యమంత్రి ప్రస్తుత టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కుతంత్రాలు చేస్తూ కుట్రలు పన్ని వైస్రాయ్ హోటల్ వద్ద ఆయనపై శాసనసభ్యుల చేత చెప్పులు వేయించాడని దాన్ని తాను “సిటీ కేబుల్” లో పని చేస్తూ వీడియో తీసి కవర్ చేశానని సినీ హాస్యనటుడు వైసీపీ నేత ఫృథ్వీ సంచలన కామెంట్స్ చేశారు. 


ఈమధ్య టీడీపీతో అంటకాగుతూ, చంద్రబాబు భజన చేస్తూ, సినీనటుడు ఆపరేషన్ గరుడ సృష్టికర్త శొంఠినేని శివాజీ అసలు ఎన్టీఆర్ మీద చెప్పులే వేయించలేదని అన్నారని తనకు తెలియని చరిత్ర వక్రీకరించి చెప్పారని - అయితే ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించినప్పుడు తాను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నానని ఫృథ్వీ,  శివాజి సోదికి కౌంటర్ ఇచ్చారు. తాను ఆంధ్రా యూనివర్సిటీ లో డిగ్రీ చదివి బతుకు దెరువు కోసం విశాఖ నుండి హైదరాబాద్ కు వలస వచ్చానని, ఆ సమయంలో పని కోసం సిటీ కేబుల్ లో చేరానన్నారు.

ఆ సమయంలో వైస్రాయ్ హోటల్ లో బస చేసిన టీడీపీ శాసనసభ్యుల వార్తలు కవర్ చేయాలని సిటీ కేబుల్ యాజమాన్యం  పంపగా, తాను వీడియో కెమెరా పట్టుకొని వెళితే, అక్కడ ఎన్టీఆర్ తన ఛైతన్య రధంపై పై నిల్చుని ధర్మపత్ని లక్ష్మీపార్వతి తో కలిసి వచ్చారని ఆ సమయంలో మైక్ ద్వారా తన శాసనసభ్యులను ఉద్ధేసించి మాట్లాడని ప్రయత్నించగా-వైస్రాయ్ హోటల్ లో ఉన్న టీడీపీ శాసనసభ్యులు చంద్రబాబు ప్రొద్భలంలో ఎన్టీఆర్ కు చెప్పులు చూపించటమే కాక, ఆయన పై చెప్పులు విసిరారని, అప్పటివరకు అభిమానధనుడుగా అసమాన రాజకీయ నాయకుడుగా బ్రతికిన ఎన్టీఆర్ హృదయంపై బలమైన దెబ్బ పడిందని పృధ్వీ అన్నారు.  ఆ వీడియోలను తానే షూట్ చేశానని ఇప్పటికీ అది సిటీ కేబుల్ లో భద్రంగా ఉన్నాయని ఫృథ్వీ సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. నటుడు కాక ముందు తాను చాలా పనులు చేశానని, జర్నలిస్టుగా కూడా చేశానని ఫృథ్వీ వివరించారు.
pridvi sivaji కోసం చిత్ర ఫలితం
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోద్బలంతో కొత్తగా టిడిపిలో చేరిన నటి దివ్యవాణి నేడు జగన్మోహనరెడ్డిని తిడుతున్న తీరును నిరసిస్తూ టీడీపీ మహిళా నేతలపై ఫృథ్వీ ఫైర్ అయ్యారు. ఆమె ఒకప్పుడు సినిమాల్లో ఆమె బాపు బొమ్మ అని ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఎలా “కీ” ఇస్తే అలా తిరిగే కీలుబొమ్మ అని ఆయన అన్నారు. టీడీపీ మహిళా నేతలు వైసీపీ నేతలపై నోరుపారేసు కుంటున్నారని జగన్మోహనరెడ్డిని ఆడిపోసుకోవటమే పనిగా పెట్టుకుంటున్నారని అన్నారు.  ఏపీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పృథ్వి మీడియాలో తన వాయిస్ పెంచారు. తెలుగుదేశం, జనసేన పార్టీలపై విమర్శలు చేస్తూ తన దైన శైలిలో జగన్మోహనరెడ్డికి మద్దతు కూడగట్టేప్రయత్నం చేస్తున్నారు. 

divyavani pridvi కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: