అదేంటో ఆంధ్ర ప్రదేశ్ ప్రతి పక్ష నేత ఏ సభ పెట్టిన జనాలు ఇసుకేస్తే రాలనంత గా వస్తున్నారు. ఇది చంద్ర బాబు ప్రభుత్వం మీద వ్యతిరేకత అనుకోవాలో , జగన్ మీద అభిమానం అనుకోవాలో తెలియటం లేదు. అయితే చంద్ర బాబు పది రోజుల క్రితం పెట్టిన బీసీ సభ కు జనాలు పెద్దగా రాలేదని చెప్పాలి. స్పష్టమైన హామీలతో.. తాను ఏం చేయదలచుకున్నారో ఆ హామీలను జగన్ ప్రస్తావించడంతో గర్జనకు వచ్చిన బీసీలంతా జగన్ కి జై కొట్టడం కనిపించింది.

Image result for jagan

తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పేందుకు వైయస్సార్సీపి ఏర్పాటు చేసిన బీసీ గర్జన వైఎస్ఆర్ సీపీ శ్రేణులు ఆశించిన దానికంటే మరింత అద్భుతంగా జరిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తన ప్రసంగంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే.. తాను చేయదలచుకున్న పనులను కూడా వివరించడం సభకు వచ్చిన వారికి ఊరటనిచ్చింది.

Image result for jagan bc garjana

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ప్రతిపక్ష నాయకుడు వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించిన ప్రతిసారి సభకు వచ్చిన వారి నుంచి అనూహ్య స్పందన వచ్చింది. చంద్రబాబు నాయుడు తన సభల్లో  మాట్లాడుతున్న ప్రతిసారీ అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటే.. బీసీ గర్జనలో మాత్రం జగన్ మాట్లాడుతున్నంత సేపు సభకు వచ్చిన వారి నుంచి చప్పట్లు  కేరింతలుకోలాహలం కనిపిస్తూనే ఉంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడికి బీసీలు కనిపిస్తారని ఎన్నికల తర్వాత వారిని పట్టించుకోరని జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: