నిన్న జరిగిన బీసీ గర్జన సభలో జగన్ బిసి కులాలకు వరాల జల్లు కురిపించాడని చెప్పాలి . అలాగే సభ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఏలూరులో ఆదివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన భారీ సభ బీసీ గర్జనలో ఆయన బీసీ డిక్లరేషన్ను ప్రకటిస్తూ... పలు కీలక ప్రకటనలు చేశారు. బీసీ సబ్ప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తామని తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే సమగ్ర బీసీ సబ్ప్లాన్ చట్టాన్ని తీసుకొస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు.

Image result for jagan sabha

బీసీ వర్గాల్లోని అన్ని కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని బీసీల్లోని 139 కులాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ మహిళకు వైఎస్సార్ చేయూత కింద రూ. 75 వేలు ప్రతి ఏడాది నేరుగా అందజేస్తామని ప్రకటించారు. గ్రామ వాలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వైఎస్సార్ చేయూత కింద డబ్బును పంపిణీ చేస్తారని వెల్లడించారు.


‘పేదవాడి సంక్షేమం కోసం దివంగత నేత నాన్న వైఎస్సార్ ఒక్క అడుగు ముందుకువేస్తే.. నేను రెండు అడుగులు ముందుకేస్తాను. మీ పిల్లలను కలెక్టర్ డాక్టర్ ఇంజినీర్ ఏదైనా చదివించండి. ఎన్ని లక్షలు ఖర్చైనా ఉచితంగా చదివిస్తాం. హాస్టల్లో ఉండి చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 20వేలు ఇస్తాం. పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి ఏటా రూ. 15వేలు ఇస్తాం’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: