జగన్ నిర్వహించిన బీసీ గర్జన సభ బంపర్ హిట్ అయ్యిందని చెప్పాలి. జనాలు తండోప తండోలుగా వచ్చారు. అయితే ఏ రాజకీయ పార్టీ కైనా బీసీ ల ఓటు బ్యాంకు చాలా ముఖ్యం. టీడీపీ కి మొదటి నుంచి బీసీ లు అండగా నిలుస్తూ వచ్చారు. అయితే ఈ సారి ఎన్నికల్లో బీసీ లు కానీ జగన్ వైపు నిలబడితే అతని దే విజయం. అయితే బీసీ గర్జన సభ లో జగన్ ప్రకటించిన వరాల జల్లు బీసీ ల మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. పైగా టీడీపీ బీసీ సభ తో పోల్చితే వైస్సార్సీపీ సభ సక్సెస్ అయ్యిందని చెప్పాలి. 


బీసీలకు జగన్ వరాల జల్లు ..!

ఈ ప్రసంగాలలో తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో వివరిస్తూనే... పాదయాత్రలో తాను చూసిన తనకు ఎదురైన అనుభవాలను సైతం సభకు వచ్చిన వారితో పంచుకున్నారు. పాదయాత్ర సమయంలో రోడ్డు పక్కన టీ దుకాణాలు నడుపుకునే వారు కూరగాయల దుకాణాలు నిర్వహించుకునే మహిళలు ఎండనక వాననక రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణాలు నడుపుకునే వారితో మాట్లాడానని అన్నారు. "చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కనీసం గుర్తింపు కార్డులు కూడా లేవు. వారికి రుణాలు ఇచ్చేందుకు ఏ బ్యాంకులు ముందుకు రావు. మేం అధికారంలోకి రాగానే ఇలాంటి చిన్న వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా అందిస్తాం" అని హామీ ఇచ్చారు. 


బీసీలకు జగన్ వరాల జల్లు ..!

ఆనాడు తన తండ్రి పాదయాత్రలో ఆయనకు ఎదురైన అన్ని అనుభవాలను తనతో పంచుకున్నారని ఆయన అనుభవాలను తాను పాదయాత్ర చేసినప్పుడు తనకు కూడా ఎదురయ్యాయని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు కొన్ని కులాలను బీసీ జాబితాలోంచి తీసివేశారని తాము అధికారంలోకి వస్తే 32 కులాలను బీసీల జాబితాలోకి తీసుకువస్తామని చెప్పారు. తమ పార్టీ బీసీలను వాడుకుని అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ కాదని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులాలకు చేతనైనంత సాయం చేయాలనుకుంటున్నామని అన్నారు.  ప్రతీ కులానికి ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తాము ప్రకటించిన నవరత్నాలు ప్రతి ఇంటికి చేరువయ్యేలా చేస్తామని ప్రకటించారు. ఇలా జగన్ బీసీ ల ఓట్లు కొల్లగొట్టేందుకు పక్కా ప్లాన్ రచించాడు. మరీ బాబు ఏం చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: