నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ కోసం సోమిరెడ్డిని చంద్రబాబునాయుడు బలిచ్చారా ? చూడబోతే అదే విధంగా కనిపిస్తోంది. పార్టీలో నేతలు కూడా అలాగే అనుకుంటున్నారు. నెల్లూరు మేయర్ గా అజీజ్ గెలిచింది వైసిపి తరపున. కానీ చంద్రబాబు ప్రలోభాలకు గురై టిడిపిలోకి ఫిరాయించారు. ఫిరాయించినందుకు కానుకగా రాబోయే ఎన్నికల్లో అజీజ్ కు నెల్లూరు అసెంబ్లీ టికెట్ ను చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇక్కడున్నది చంద్రబాబు కదా. అందుకనే చాలా సులభంగా మాటదాటేశారు.

 Image result for somireddy chandramohan reddy

రాబోయే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుండి మంత్రి నారాయణ పోటీకి రెడీ అవుతున్నారు. అంటే అజీజ్ కు టికెట్ లేదన్నమాటే. దాంతో మేయర్ అడ్డం తిరిగారు. అసలే జనాల్లో చంద్రబాబు పాలనపై తీవ్రమైన వ్యతిరేకత అనే ప్రచారం తెలిసిందే. దానికితోడు దాదాపు 30 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు గణనీయంగా ఉంది. కడప, గుంటూరు, నెల్లూరు,  నంద్యాల, కదిరి, పీలేరు, మదనపల్లి, కర్నూలు, పుంగనూరు లాంటి నియోజకవర్గాలతో పాటు మరో 22 నియోజకవర్గాల్లో ముస్లింలదే డిసైడింగ్ ఫ్యాక్టర్. అందుకే టికెట్ తనకే దక్కాలంటూ అజీజ్ అడ్డం తిరిగారు.

 Image result for somireddy chandramohan reddy and azeez

రేపటి రోజున నెల్లూరులో నారాయణ గెలవాలంటే ముస్లింల మద్దతు తప్పనిసరి. అలాంటిది అజీజ్ అడ్డం తిరిగేసరికి చంద్రబాబుక దిక్కుతోచలేదు. మేయర్ విషయానికి ఏదో ఒకరకంగా ఫులిస్టాప్ పెట్టకపోతే మొత్తం ముస్లింలు ఎదురుతిరుగే అవకాశాలున్నాయని టెన్షన్ మొదలైంది. దానికి తోడు ఈమధ్యనే నారా హమారా ముస్లిం హమారా అనే నినాదంతో గుంటూరులో బహిరంగసభ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇపుడు గనుక మేయర్ విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే నారా హమారా ముస్లిం హమారా అన్న నినాదం ఉత్తదే అని తేలిపోతుంది.

 Image result for chandrababu and azeez

దాంతో సమస్య పరిష్కారానికి చంద్రబాబుకు సోమిరెడ్డి కనిపించారు. అంతే వెంటనే సోమిరెడ్డిని పిలిచి రాజీనామా చేయమని ఆదేశించారు. నిజానికి ఆ రాజీనామా ఏదో నారాయణనే చేయించొచ్చు. కానీ విచిత్రంగా మేయర్, నారాయణ అంశంతో సంబంధం లేని సోమిరెడ్డితో చంద్రబాబు రాజీనామా చేయించారు. సర్వేపల్లిలో పోటీ చేయటానికి వీలుగా తాను రాజీనామా చేసినట్లు సోమిరెడ్డి చెప్పటంలో అర్ధమే లేదు. సర్వేపల్లిలో పోటీ చేయాలంటే ఇపుడు ఎంఎల్సీగా రాజీనామా చేయాలనేంలేదు.

 Image result for chandrababu and azeez

అజీజ్ కు ఎలాగూ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేరు కాబట్టి సోమిరెడ్డిని బలిపశును చేశారని అర్ధమైపోతోంది. సోమిరెడ్డి పదవీ కాలం ఇంకా సుమారుగా మూడు సంవత్సరాలుంది. కాబట్టి సోమిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పదవిని అజీజ్ కు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అంటే ఇటు అజీజ్ ను సాటిస్ఫై చేసినట్లుంటుంది. అటు నారాయణను కాపాడుకున్నట్లూ ఉంటుందన్నది చంద్రబాబు ప్లాన్.

 Image result for chandrababu

నిజానికి పోయిన మేయర్ ఎన్నికల్లో అజీజ్ వైసిపి తరపున పోటీ చేశారు కాబట్టే గెలిచారు. అజీజ్ స్ధానంలో ఇంకెవరు పోటీ చేసినా గెలిచుండేవారే. అదే సమయంలో అజీజ్ టిడిపి తరపున పోటీ చేసుంటే గెలిచేవారు కాదన్నదీ వాస్తవమే. మరి ఇంతోటి దానికి దశాబ్దాల తరబడి సన్నిహితంగా ఉన్న సోమిరెడ్డిని మేయర్ అజీజ్ కోసం ఎందుకు బలితీసుకున్నారో నేతలెవరికీ అర్ధం కావటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: