మనదేశంలో సెంటిమెంట్స్ కు కొదువ లేదు. ఏ నమ్మకం ఎందుకు ఏర్పడుతుంతో చెప్పలేం కానీ.. ఆ నమ్మకాలు మాత్రం భలే విచిత్రంగా ఉంటాయి. అలాంటిదే ఢిల్లీ కుర్రాళ్ల ఓ విశ్వాసం మాత్రం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉన్నత విద్య చదివే అబ్బాయిలు కూడా ఇలాంటి నమ్మకాలు పెట్టుకోవడం షాక్ కలిగిస్తుంది.

సంబంధిత చిత్రం


ఇంతకీ ఆ నమ్మకం ఏంటనుకుంటున్నారా.. దిల్లీలోని ప్రతిష్టాత్మకమైన హిందూ కాలేజిలో ఓ చెట్టు ఉంది. ఆ చెట్టును అక్కడ వర్జిన్ ట్రీ అని పిలుచుకుంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఆ చెట్టు కొమ్మకు కండోమ్‌ ను నీటితో నింపి కడితే.. ఆరునెలల్లో శృంగార అనుభవాన్ని అనుగ్రహిస్తుందట.

సంబంధిత చిత్రం


చెట్టూకూ సెక్స్ కూ లింకేమిటీ అని అడగకండి అది అక్కడి కాలేజీ కుర్రాళ్ల విశ్వాసం. అది కూడా ఎప్పుడుపడితే అప్పుడు కట్టగూడదు. కేవలం వాలెంటైన్స్ డే రోజు మాత్రమే కట్టి నమస్కారం పెట్టుకోవాలి. అలా చేస్తే, 6 నెలల్లోపు అమ్మాయితో లైంగికంగా కలిసే అవకాశం దక్కి, వర్జినిటీ కోల్పోతామన్నది ఆ కుర్రాళ్ల విశ్వాసం.

సంబంధిత చిత్రం


అందుకే ఆ కాలేజీలోని ఆ చెట్టు ముందు వాలంటైన్స్ డే రోజు.. మాంచి హడావిడి ఉంటుంది. కుర్రాళ్లంతా కండోములు పట్టుకుని అక్కడికొస్తారు. కొన్ని దశాబ్దాలుగా ఈ కాలేజ్ లో విద్యార్థులు ప్రేమికుల రోజున ఈ పూజను చేస్తున్నారు. వర్జిన్ ట్రీ కొమ్మలకు బెలూన్లు, రంగురంగుల రిబ్బన్లు కడతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: