“నేను హోంవర్క్ చేయలేదు. ఎందుకంటే స్కూల్-వర్క్‌ని ఇంటి దగ్గర చేయడం నాకు ఇష్టం లేదు” అని రాసిన ఆ బుడుగు మాట ప్రపంచంలోని చాలా మందిని ఉలిక్కిపడేట్లు చేసి మేల్కొలిపింది. కళ్లు తెరిపించింది.  ఎందుకంటే పిల్లలకు హోం-వర్క్ ఇవ్వాలా? వద్దా? అనేది ఒక పెద్ద ప్రశ్న. దశాబ్ధాలుగా పరిష్కారం దొరకని సమస్య. కొంత మంది హోం-వర్క్ ఇవ్వాలి అంటారు. మరికొందరు అలా కూడదు, వద్దంటారు. అదో పెద్ద ఇష్యూ. పిల్లల విషయంలో ఇది ఒక అంతర్జాతీయ సమస్య. 
Edward immanuel cartez a school child about home work కోసం చిత్ర ఫలితం
పిల్లలని చక్కగా ఆడుకోనివ్వాలని, వారికి చదువులతో పాటు ఆట పాటలు కూడా అవసరమని — ఆడుకోవాలని,  పాడుకోనివ్వాలని అప్పుడే వారిలో జ్ఞానం పరిఙ్జానం పరిమళిస్తుందని  చెబుతుంటారు. అయితే, అసలు విద్యార్థులకు హోం-వర్క్ ఇవ్వాలా? వద్దా? అనే విషయాన్ని ఆ పిల్లలనే ఎప్పుడైనా అడిగితే ఎలా ఉంటుంది? 


అలాంటి ప్రశ్నే ఒక టీచర్ తన విద్యార్థిని అడిగింది. అందుకు ఆ బుడుగు ఇచ్చిన సమాధానం చూసి ఆ టీచర్ షాక్! అయితే, నెటిజన్లు మాత్రం ఫిదా! అవుతున్నారు. బుడుగు వాదన చూసి నోటిపై వేలుకొంటూ మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు.
 

యుఎస్ కాలిఫోర్నియాలో ఎడ్వర్డ్ ఇమ్మాన్యుయేల్ కార్టెజ్ అనే బుడుగు బుడతడైన విద్యార్థి ఉన్నాడు. శనివారం, ఆదివారం స్కూలుకి సెలవులు కాబట్టి, ఈ వారాంతంలో పూర్తి చేయా లంటూ హోం-వర్క్ ఇచ్చింది టీచర్. అయితే, టీచర్ ఇచ్చిన హోం-వర్క్‌ని ఇంటి దగ్గర చేయకుండానే పాఠశాలకు వెళ్లాడు ఎడ్వర్డ్.  వారాంతం అంతా ఉల్లాస ఉత్సాహంతో ఆటలు పాటల తో గడిపేసి చక్కగా  హోం-వర్క్ చేయకుండా స్కూల్కి రాగా, హోం-వర్క్ చేయకుండా ఎందుకు వచ్చావు? అంటూ టీచర్ బుడుగు ఎడ్వర్డ్ ని నిలదీసింది.  దానికి మన ముదురు బుడుగుకి అసలు హోం-వర్క్ ఎందుకు చేయలేదో వివరణ ఇవ్వాలని ఆర్డర్ కూడా వేసింది టీచర్.  ఆ తరవాత బుడుగిచ్చిన జవాబు చూసి షాక్!  కూడా అయింది. ఈ సంగతి అంతర్జాలంలో షేర్ అవ్వటంతో చూసిన జనాలు వారేవ్వా! అంకుండా ఉండలేక పోతున్నారు.
 

నేను హోంవర్క్ చేయలేదు. ఎందుకంటే స్కూల్-వర్క్‌ ని ఇంటి దగ్గర చేయడం నాకు ఇష్టం లేదు. వీకెండ్ ఉండేది స్నేహితులతో ఆడుకుని ఎంజాయ్ చేయడానికి.  నాకు ఏది సంతోషంగా అనిపిస్తే అదే చేస్తా! నువ్వు బాస్ కానీ, టీచర్ కానీ అవటం వలన ఈ పరిస్థితి వచ్చింది. రియల్ వరల్డ్‌-జాబ్స్ ఎప్పుడూ హోం-వర్క్‌ ఇవ్వవు. కాబట్టి స్కూల్-వర్క్ ఇంటిదగ్గర చేయకూడదు. ఎందుకంటే దాని వల్ల ఉపయోగం లేదు.’ అని సమాధానం రాసేశాడు.
 
హోంవర్క్ వృధా అంటూ టీచర్‌కు ఎడ్వర్డ్ ఇమ్మాన్యుయేల్ కార్టెజ్ రాసిన లెటర్
Edward immanuel cartez a school child about home work కోసం చిత్ర ఫలితం 
ఆ లెటర్‌లో అతడు రాసిన ఈ పదాలే హైలైట్ అనుకుంటే, అంతకు మించిన అద్భుతమైన వాక్యాలు మరిన్ని ఉన్నాయి. ‘హోంవర్క్ అనేది ఉపయోగం లేదు కాబట్టి, స్టూడెంట్ వర్సెస్ హోం-వర్క్ కేసులో ఎడ్వర్డ్ వాదనకు న్యాయస్థానం కూడా ఎడ్వర్డ్ కు మద్దతుగా నిలిచింది. ఇక కేసు క్లోజ్ అయింది’ అని ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
 Edward immanuel cartez a school child about home work కోసం చిత్ర ఫలితం
ఈ లెటర్ చూసిన నెటిజన్లు అతడి టాలెంట్‌ను చూసి ఫిదా! అయిపోతున్నారు. కొందరైతే అతడికి 'నోబెల్ ప్రైజ్' ఇవ్వాలని సూచిస్తే, మరికొందరు ఆ బుడతడికి వందకు 100 మార్కు లు వేస్తున్నారు.
Edward immanuel cartez a school child about home work కోసం చిత్ర ఫలితం 
ఒక నెటిజన్ అయితే, నేను టీచర్ కాదు. బాస్ కూడా కాదు. కానీ హోం-వర్క్ చేయాల్సి వస్తోంది అంటూ నిర్వేదంగా పెట్టిన పోస్ట్ కూడా ఆకట్టుకుంటోంది. మొత్తానికి ఈ పిల్లాడి లెటర్ ఇంటర్నెట్‌లో పెద్ద సంచలనంగా మారింది.


Edward immanuel cartez a school child about home work కోసం చిత్ర ఫలితం

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: