చంద్రబాబునాయుడుకు మరో ఎంపి షాక్ ఇవ్వబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం ఎంపి పందుల రవీంద్ర లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డితో భేటీ అవబోతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏదైనా ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయటానికి వీలుగా రావీంద్ర వైసిపిలో చేరాలని నిర్ణయుంకున్నారు. అదే సమయంలో టిడిపిపై పెరిగిపోతున్న ప్రజా వ్యతిరేకత స్పష్టం కనిపిస్తోంది. దాంతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడుతున్నారు. టిడిపి నుండి ప్రజా ప్రతినిధులు వచ్చేస్తుండటానికి అది కూడా ఓ కారణమే.

 

పోయిన ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుండి రవీంద్ర గెలిచారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఎంపికి కాకుండా అసెంబ్లీకి పోటీ చేయాలని రవీంద్ర ఆసక్తి చూపుతున్నారు. అదే విషయాన్ని చంద్రబాబుతో చెబితే సానుకూలత కనబడలేదు. వేరేవరినైనా ఎంపిగా పోటీ చేయించాలన్న రవీంద్ర సూచనను చంద్రబాబు పట్టించుకోలేదట. దాంతో ఎంపిగా పోటీ చేయటం ఇష్టం లేక, అసెంబ్లీకి పోటీ చేయటానికి అవకాశం రాకపోవటంతోనే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.

 

ఎప్పుడైతే టిడిపికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారో వెంటనే వైసిపి నేతలతో టచ్ లోకి వెళ్ళారు. రవీంద్రను చేర్చుకోవటానికి జగన్ కూడా సానుకూలంగా స్పందించటంతో లోటస్ పాండ్ భేటీకి రంగం సిద్ధమైంది. జగన్ తో భేటీ అంటేనే టిడిపికి దాదాపు రాజీనామా చేసేసినట్లే. నిజానికి నాలుగు రోజుల క్రితం అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ తో పాటే రవీంద్ర కూడా వైసిపిలో చేరాల్సింది. కాకపోతే నాలుగు రోజులు ఆలస్యమైందంతే. మరి రవీంద్రకు జగన్ ఏమి హామీ ఇచ్చారో తెలియాల్సుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: