ఎన్నిక‌ల‌కు వేళాయో..! అంటూ  నెల్లూరు రాజ‌కీయ నేత‌లు 360 డిగ్రీల్లో త‌మ అవ‌కాశాల‌ను ప‌రిగ‌ణించుకుని..హామీ ల‌భిస్తే ఇక్క‌డి వారు అక్క‌డికి...అక్క‌డి వారు ఇక్క‌డికి అన్న‌ట్లుగా పార్టీల్లోకి మారుతున్నారు. ప్ర‌స్తుతం  వైసీపీ..టీడీపీల్లో నాయ‌కుల మార్పులు..చేర్పుల‌తో స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. ఎలాగైనా జిల్లాలో అత్య‌ధిక స్థానాల్లో పాగా వేయాల‌న్న‌దే రెండు పార్టీల ల‌క్ష్యం. అందుకే బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిల‌ప‌డ‌మే కాదు...బ‌ల‌మైన నాయ‌కులు వెళ్లిపోకుండా చూసుకోవాల‌ని చూస్తోంది. సొంత బ‌లం కాపాడుకుంటూనే...అద‌న‌పు బ‌లం తెచ్చుకోవాల‌ని చూస్తున్నాయి. అయితే ఈ విష‌యంలో కొంత ఎమ్మెల్సీ ప‌ద‌వితో మంత్రిగా కొన‌సాగుతున్న సొమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి త్యాగం కొద్దిగా టీడీపీకి ఊర‌టినిచ్చింది. 


ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్ర‌త్యక్షంగా తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగేందుకు సిద్ధ‌మ‌య్యారు. సోమిరెడ్డి నిర్ణ‌యంతో ఎమ్మెల్సీగా మ‌రొక‌రిని నియ‌మించుకునే అవ‌కాశం ద‌క్కింది అధిష్టానానికి. ఈ విష‌య‌మై సోమిరెడ్డిని చంద్ర‌బాబు కూడా అభినందించిన‌ట్లు స‌మాచారం.ఇదిలా ఉండ‌గా సోమిరెడ్డి ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన రోజునే వైసీపీ జిల్లా అధినాయ‌క‌త్వంలో కీల‌కంగా ప‌నిచేస్తున్న మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి, వంటేరు గోపాల్‌రెడ్డిలు వారు ఆ పార్టీకి రాజీనామా చేయ‌డంలో నెల్లూరు రాజ‌కీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఈ ఇద్ద‌రు కీల‌క నేత‌లు కావ‌లి అసెంబ్లీ సీటు లేదా నెల్లూరు ఎంపీ సీటు ఇస్తే టీడీపీలోకి జంప్ చేసేందుకు రెడీగా ఉన్నారు.


వీరిద్ద‌రి రాజీనామాతో కావాలి, ఉద‌య‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలతో పాటు నెల్లూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో వైసీపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. టీడీపీకి ఇది చాలా ప్ల‌స్ అవుతుంద‌ని స‌మాచారం. అయితే చంద్ర‌బాబు ఇప్ప‌టికే కావ‌లి సీటును మాజీ ఎమ్మెల్యే బీద మ‌స్తాన్‌రావుకు, నెల్లూరు ఎంపీ సీటును జ‌డ్పీచైర్మ‌న్ బొమ్మిరెడ్డి రాఘ‌వేంద‌ర్‌రెడ్డికి ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. దీంతో కావ‌లి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఈ ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేల ఎఫెక్ట్ వైసీపీకి గ‌ట్టిగానే ప‌డ‌నుంది.

మ‌రో ముఖ్య‌నేత మంత్రి నారాయ‌ణ కూడా ఎమ్మెల్సీ ప‌ద‌వి మీదే కొన‌సాగుతున్నారు. ఆయ‌న స్థానంలో కూడా మ‌రో నేత‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి అప్ప‌గిస్తే పార్టీలో కొంత అస‌మ్మ‌తి త‌గ్గుతుంద‌న్న‌ది చంద్ర‌బాబు వ్యూహాంగా తెలుస్తోంది. ఇక నెల్లూరు ప‌ట్ట‌ణ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ టికెట్ ఆశిస్తున్న అబ్దుల్ అజీజ్‌కు ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని కూడా చంద్ర‌బాబు యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. నారాయ‌ణ ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాడ‌ని చంద్ర‌బాబు విస్ప‌ష్టంగా ప్ర‌క‌ట‌న చేసిన నాటి నుంచి ఆయ‌న పార్టీకి అంటీ ముట్ట‌నట్లుగా ఉంటూ వ‌స్తున్నారు. తాజా నిర్ణ‌యంతో ఆయ‌న కూడా కాస్త మెత్త‌బ‌డే అవ‌కాశ‌మైతే ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: