జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై పుల్వామా వద్ద సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి వ్యూహరచన పాకిస్తాన్‌ వేదికగానే జరిగినట్లు భారత నిఘావర్గాలు తెలిపాయి. పుల్వామా ఉగ్రదాడి కి తామే బాధ్యులమని పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ పై దాడికి పాల్పడాలని జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ సూచనలు ఇచ్చినట్లు గుర్తించాడు.
adil ahmed dar కోసం చిత్ర ఫలితం
అనారోగ్య కారణాలతో గత కొన్ని నెలలుగా రావాల్సిండి లోని ఆర్మీ బేస్ ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటున్న ఆయన అక్కడే దాడికి వ్యూహరచన చేశాడు. పుల్వామా దాడికి ఆదేశాలిచ్చి భారీ విధ్వాంసానికి కుట్ర పన్నాడు. అక్కడ నుండి ఆయన ఇచ్చిన ఆదేశాలను అబ్ధుల్ రషీద్ ఘాజీ అనే ఒక పాక్ ఉగ్రవాది ద్వారా 43మంది సిఆర్పిఎఫ్ జవాన్ల హతకుడు కాశ్మీరీ   యువకుడు అదిల్ అహ్మద్ దార్‌ కు సందేశాలు ఇచ్చి ఈ దురాగతానికి పాల్పడ్డాడు.
abdul rashid ghazi కోసం చిత్ర ఫలితం
ఈ మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటానికి ఐఖ్యరాజ్య సమితి శాశ్విత సభ్యదేశాలన్నీ ఆమోదం తెలిపినా ఒక్క చైనా,  భారత్ పై కక్షతో అంగీకరించక పోవటంతో మసూద్ అజహర్ ఇంకా బ్రతికి ఉన్నాడు. ఈ మొత్తం పాపానికి  రూట్ కాజ్ చైనా కాగా,  కేంద్రస్థానం పాకిస్తాన్.  మసూద్ అజహర్ కి ఆశ్రయమిచ్చి కాపాడుతూ వస్తుంది
 jaish e mohammad chief masood azhar gave nod for pulwama attack from Army base hospital in rawalpindi

అయితే పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసి 43మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మరణానికి అత్యంత తక్షణ తొలి ప్రతీకారం  భారత్  తీర్చుకుంది. పుల్వామా దాడికి కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్ టాప్ కమాండర్ అబ్డుల్ రషీద్ ఘాజీ ని భారత సైన్యం మట్టుబెట్టింది. పుల్వామా దాడికి తెగబడిన ఉగ్రవాదుల కోసం సైన్యం విస్తృతంగా “సెర్చ్ ఆపరేషన్” చేసింది. ఈ క్రమంలో నిన్న ఆదివారం రాత్రి పుల్వామా జిల్లాలోని పింగ్లాన్ వద్ద భద్రతా దళాలకు ఉగ్రవాదులు తారసపడ్డారు. సైన్యంపై కాల్పులు జరుపుతూ భవనంలో దాక్కొన్న ముష్కరుల ను సైన్యం తీవ్రంగా శ్రమించి హతమార్చింది. అయితే ఉగ్రవాదులతో జరిగిన పోరులతో ఆర్మీ మేజర్ సహా ముగ్గురు జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు.
adil ahmed dar కోసం చిత్ర ఫలితం
32 ఏళ్ల అబ్ధుల్ రషీద్ ఘాజీ జైషే మహమ్మద్ అధినేత ఇండియన్ ఎయిర్-లైన్స్ విమానాన్ని కాందహార్ లో కిడ్-నాప్ చేసి తప్పించుకున్న తీవ్ర ఉగ్రవాది మసూద్ అజహర్‌కు అత్యంత నమ్మకస్తుడు. ఆఫ్గనిస్తాన్‌ లోని తాలిబాన్ గ్రూపులో శిక్షణ పొందాడు. ఆఫ్గనిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న ఇతను “ఐఈడీ” అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్సుప్లొసివ్ డివైజ్ తయారు చేయడం, అమర్చడం, వాటిని పేల్చడంలో విశేష అనుభవం ఉన్న నిపుణుడు. ఈ సందర్భంగా 350 కిలోల బరువైన ఐఈడి తయారు చేయటానికి అదిల్ అహ్మద్ దార్‌ కు తర్ఫీదు ఇవ్వటం జరిగింది. 
abdul rashid ghazi కోసం చిత్ర ఫలితం
అయితే మసూద్ అహమ్మద్ మేనల్లుళ్లు తాలా రషీద్, ఉస్మాన్‌ లను గతంలోనే  భారత సైన్యం మట్టుబెట్టడంతో రగిలిపోయిన మసూద్ అజహర్, వారి మరణానికి కారణమైన భారత భద్రతా దళాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు గాను అబ్ధుల్ రషీద్ ఘాజీ ని రంగంలోకి దింపాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ తో పాటు దక్షిణ కశ్మీర్‌ లోని యువతను రెచ్చగొట్టి వారిని భారత్‌ పైకి ఊసి గొల్పడంలో అబ్ధుల్ రషీద్ ఘాజీ కీలక పాత్ర పోషించాడు. తాజాగా పుల్వామా లో జరిగిన ఉగ్రదాడికి వ్యూహం పన్ని అదిల్ అహ్మద్ దార్‌ ని సూసైడ్ బాంబర్‌ గా మార్చాడు. కొద్దిరోజుల క్రితం రతన్‌పోరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌ లో తృటిలో తప్పించుకున్న అబ్ధుల్ రషీద్ ఘాజీ  ఎట్టకేలకు భారత సైన్యం చేతిలో హతమయ్యాడు. 

Jaish-e-Mohammed chief Masood Azhar's nephew Talha Rasheed

jaish-e-Mohammed chief Masood Azhar's nephew Talha Rasheed was killed in Pulwama encounter 2017

మరింత సమాచారం తెలుసుకోండి: