తెలంగాణా రాష్ట్రానికి సార్వం సహా సార్వభౌముడు కలవకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పకతప్పదు. అందుకు తేటతెల్లంగా కారణం కనిపిస్తూనే ఉంది. ఏమంటే ఈ రాష్ట్రంలో ఎన్నికల పలితాలు ప్రకటించి మూడు మాసాలుగా రాష్ట్ర పాలన కు మంత్రి మండలి ఏర్పాటు చేయలేదు. అంటే ఇప్పుడు నడిచేది తెలంగాణా ప్రతిపక్షాలు అంటున్నట్లు "దొరవారి పాలన" అనే అందరూ అంటున్నట్లే అనిపిస్తుంది.

 

రాష్ట్రంలో పాలనలో కాస్త ఉక్కపోత మొదలైందని అంటున్నారు. అయితే సఫకేషన్ నుండే తిరుగుబాటు మొదలౌతుందంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్ది వ్యాఖ్యల ప్రకారం రాష్ట్రంలో అదే జరుగుతుందా? కొత్త రాజకీయ సమీకరణాలకు ఆజ్యం ఎవరైనా పోస్తున్నారా? అన్నీ అనుమానాలకు సాక్ష్యం కనిపిస్తుందా?

 kcr vs harish rao revanth reddy in between కోసం చిత్ర ఫలితం

టీఆర్ఎస్ రెండోసారి అధికారం లోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన మేనల్లుడు మాజీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీశ్ రావును క్రమంగా దూరం పెట్టడంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. రాష్ట్రంలో యువరాజు కేటీఆర్ ఆధి పత్యానికి హరీష్ అడ్డు రాకూడదన్న ఉద్దేశం తోనే కేసీఆర్ ఆయన్ను దూరం పెట్టారని కొందరు  అంటుంటే, హరీశ్ రావును తనతో పాటు ఢిల్లీ రాజకీయాలకు తీసుకెళ్లేందుకే రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రాధాన్యం తగ్గించేశారని మరికొందరు చెబుతున్నారు.

 

ఈ నేపథ్యంలో టీ-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం మరో కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. హరీశ్‌ రావు ను కేసీఆర్ పక్కన పెట్టడం వెనుక అసలు రహస్యం వేరే ఉందని ఒక టీవి చానెల్ చిట్‌ చాట్‌లో రేవంత్ రెడ్డి అన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి గా పనిచేసినప్పుడు హరీశ్ రావు, గౌరెల్లి, తోటపల్లి, మానేరు రిజర్వాయర్ల పనుల్లో ₹1000 కోట్ల వరకు అక్రమంగా వెనకేసుకున్నారని ఆరోపించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలకు హరీశ్ రావు ఆ డబ్బు పంచినట్టు ఆరోపణలు చేశారు.

revanth reddy interview harish in talks with amith shah కోసం చిత్ర ఫలితం 

టీఆర్ఎస్ వర్గాలకు తెలియకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో హరీశ్ రావు రహస్యంగా ఫోన్‌ లో మాట్లాడారని రేవంత్ బాంబు పేల్చారు. అమిత్ షా తో ఫోన్ కాల్ వ్యవహారం కేసీఆర్‌ కు హరీశ్ రావు పీఏ నే అమిత్ షాతో ఫోన్ కాల్ రికార్డింగ్స్‌ ను కేసీఆర్‌కు చేరవేసినట్టు చెప్పారు. తనకు తెలియకుండా హరీశ్ రావు తెర వెనుక నడుపుతున్న ఈ రాజకీయ తతంగం ఆయనకు నచ్చలేదని అన్నారు. హరీశ్ రావు వ్యవహారం నచ్చకనే ఆయన్ను మంత్రివర్గం నుంచి దూరం పెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు.

 

ఇదిలా ఉంటే, గతంలోనూ హరీశ్ రావు పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ ను సీఎం చేస్తే టీఆర్ఎస్ చీలిపోతుందని, ఆ చీలిక వర్గానికి హరీశ్ రావు నాయకత్వం వహిస్తారని అప్పట్లో కామెంట్ చేశారు. అయితే ప్రత్యర్థులు ఎన్ని ఆరోపణలు చేసినా, తన పుట్టుక - చావు రెండూ టీఆర్ఎస్‌ లోనే అని హరీశ్ రావు పదేపదే చెబుతూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి తాజా సంచలన వ్యాఖ్యలపై హరీశ్ రావు ఎలా స్పందిస్తరాన్నది ఇప్పుడు చాలా ఆసక్తి కరంగా మారింది.

amith shah harish rao కోసం చిత్ర ఫలితం 

గతంలో గజ్వెల్ కాంగ్రెస్ అభ్యర్ధిగా వంటేరు ప్రతాప రెడ్డి కూడా హరీష్ రావుపై ఇంతకంటే బలమైన వ్యాఖ్యలే చేశారు. మరి రేవంత్ రెడ్ది కూడా ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ పొగకు మూలమైన నిప్పు ఉందంటారా?

మరింత సమాచారం తెలుసుకోండి: