టీడీపీ మంత్రి , చంద్ర బాబు కుమారుడు అయినా లోకేష్  కోసం కొంత మంది ఎమ్మెల్యేలు సీటు త్యాగం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం కామెడీగా మారుతుందని చెప్పాలి. సోమిరెడ్డి, రామసుబ్బారెడ్డి లాంటివాళ్లు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలను ఎదుర్కొని.. లోకేష్ మాత్రం ఎమ్మెల్సీ పదవిని అలాగే పెట్టుకుని ఎమ్మెల్యేగా పోటీచేస్తే.. అంతకన్నా అవమానం ఏముంటుంది! దాన్ని తట్టుకోలేక లోకేష్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా.. లైట్ తీసుకుంటారా.. అనే చర్చ జరుగుతూ ఉంది.

Image result for lokesh

ఆ సంగతలా ఉంటే.. మరోవైపు తమ సీటు నుంచి లోకేష్ పోటీ చేయాలని అంటూ ఓపెన్ ఆఫర్లు ఇచ్చే నేతలు పెరుగుతూ ఉన్నారు. ఇదివరకే తమ సీటు నుంచి లోకేష్ పోటీ చేయాలని కొందరు తెలుగుదేశం నేతలు కామెడీ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఫిరాయింపు మంత్రి అమర్ నాథ్ రెడ్డి తను ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు నుంచి లోకేష్ పోటీ చేయాలని అన్నాడు. సిట్టింగ్ స్థానం నుంచి మళ్లీ పోటీచేసే ఆసక్తి లేక అమర్ నాథ్ రెడ్డి అలా లోకేష్ ను ఇరికించే ప్రయత్నం చేశారు.

Image result for lokesh

ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు కర్నూలు ఎమ్మెల్యే, ఫిరాయింపు నేత ఎస్వీ మోహన్ రెడ్డి కూడా ఇదే త్యాగానికే రెడీ అంటున్నారు. కర్నూలు నుంచి లోకేష్ పోటీ చేయాలని అంటున్నారీయన.  కర్నూలు నుంచి లోకేష్ పోటీచేస్తే తను త్యాగానికి రెడీ అని.. మరేచోట టికెట్ అడిగేది కూడా ఉందని ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎలాగూ ఆ సీట్ల జోలికి రారని తెలిసీ.. వీళ్లు ఇలా మాట్లాడుతూ ఉన్నారంటే.. లోకేష్ పోటీకి ఏ నియోజకవర్గం లేదని దెప్పి పొడుస్తున్నట్టుగానే ఉంది!

మరింత సమాచారం తెలుసుకోండి: