ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ హవా కొనసాగుతోంది. ప్రజా సంకల్ప పాదయాత్ర తో ఆంధ్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసి కూటమిగా ఉన్న మూడు పార్టీలను చీల్చిన జగన్ 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కి దిమ్మతిరిగిపోయే విధంగా రాజకీయాలను చేస్తూ ఇటు రాష్ట్ర సర్వేలో లోనూ అటు జాతీయ సర్వేలో లో తన ఊపు కొనసాగిస్తున్నారు.

Related image

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి చాలా మంది ప్రజాప్రతినిధులు వైసిపి పార్టీ కండువా కప్పుకున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ నాయకురాలు, శ్రీకాకుళం మాజీ ఎంపీ కిల్లి కృపారాణి వైసీపీలో చేరనున్నారు. ఆమె లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసి పార్టీలో చేరనున్నారు. ఆమె వైసీపీ నుంచి రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా లేదా టెక్కలి ఎమ్మెల్యేగా బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Image result for jagan smiles

మొత్తం మీద వైసిపి పార్టీ స్పష్టమైన హవాతో రాష్ట్రంలో రాజకీయాన్ని రసవత్తరం చేస్తూ ముందుకు సాగుతుంది. ఇదే క్రమంలో ఎన్నికలు షెడ్యూల్ రాకముందే ఇంకా చాలామంది అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు భారీగా వైసీపీ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వినపడుతున్నాయి.

Image result for jagan smiles

మొత్తంమీద చూసుకుంటే చివరాకరికి వార్ వన్ సైడ్ అని అంటున్నారు వైసిపి పార్టీకి చెందిన నేతలు. ఇదే క్రమంలో గత ఎన్నికల్లో కొద్దిపాటి శాతంతో అధికారం కోల్పోయిన జగన్ కూడా ఎక్కడ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించకుండా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని పుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: