భారత్ లాంటి దేశాల్లో అధికారుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. రాజకీయాల్లో నాయకులు ప్రజల నుంచి వచ్చినా వారుండేది అచ్చంగా అయిదేళ్ళు మాత్రమే. అయితే అధికారులు మాత్రం దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉంటారు. అంటే సగటున వారు ఏడు సార్వత్రిక ఎన్నికలు చూస్తారు. ఓ విధంగా రాజకీయం అంతా వారి దగ్గరే ఉంటుందంటి  నమ్మాలి మరి.


ప్లేట్ ఫిరాయిస్తారా :


ఏపీలో ప్రభుత్వం మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయని ఏకంగా అధికారులే భావిస్తున్నారు. ఏపీలో గాలి తిరబడుతోందని, అది అధికార పార్టీకి ఎదురుగాలిగా వీస్తోందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలో అంతకంతకు ప్రతిపక్ష వైసీపీ బలం బాగా పెరగడాన్ని రాజకీయలకు అతీతంగా అధికారులు అంచనా కడుతున్నారు. జగన్ పాదయాత్ర మొదలుపెట్టింది లగాయితూ ఏపీలో మెల్లగా మొదలైన మార్పు ఇపుడు తారస్థాయికి చేరుకుందని అధికారులు లెక్కలు కడుతున్నారు


తాజాగా ఏలూరులో నిర్వహించిన వైసీపీ బీసీ గర్జన సూపర్ సక్సెస్ కావడం, అక్కడకు వచ్చిన జనం సీఎం జగన్ అంటూ అలుపెరగకుండా నినాదాలు చేయడాన్ని కూడా అధికారులు మధింపు చేసుకుంటున్నారు. దాన్ని చంద్రబాబు నిర్వహించిన జయహో బీసీ సభతో పోల్చుకుంటే నాలుగైదు రెట్లకు పైగా జనం స్వచ్చందంగా  జగన్ సభకు వచ్చారన్నది అధికారుల లెక్కగా కనిపిస్తోంది. పైగా అధికార పార్టీ బీసీ  సభకు భోజనాలు తాయిలాలు అన్నీ ఇచ్చినా మొక్కుబడి తంతుగా సాగిందని కూడా అంటున్నారు. మొత్తానికి అధికారుల సర్వే చూస్తూంటే ఏపీలో సర్కార్ మారడం ఖాయమని తేలుతోంది.


సార్వత్రిక షెడ్యూల్ తర్వాత :


ఇక అధికారులు తమ అసలైన రూపాన్ని సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తరువాత చూపిస్తారని అంటున్నారు. అధికారులు ఇకపై టీడీపీకి మొగ్గుగా కాకుండా తటస్థంగా వ్యవహరిస్తారని కూడా చెప్పుకుంటున్నారు. రేపటి రోజున ప్రభుత్వం మారితే తమకు తిప్పలు తప్పవన్న  ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అధికారులు ఈ విధంగా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇక ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు సైతం ఎన్నిక కోడ్ రాగానే అలెర్ట్ అయిపోవడం చూస్తూనే వున్న సంగతే. మొత్తంగా ఏపీ పరిస్థితిని చూసినపుడు రేపటి ముఖ్యమంత్రి జగన్ అన్న దానిపైన అధికార వర్గాంలో కచ్చితమైన అంచనా వుందని చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: