తెలంగాణ కేబినెట్ విస్తరణలో హరీశ్ రావుకు చోటు దక్కలేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్టీని తెలంగాణ ఉద్యమాన్ని జనంలో నిత్యం నానేలా చేయడంలో కేసీఆర్‌కు రాజకీయంగా తోడు–నీడగా నిలిచిన హరీశ్‌రావుకు ఇప్పుడు ప్రాధాన్యం తగ్గిపోతోందిహరీశ్‌రావును ఫేడవుట్‌ చేయాలన్న ప్రయత్నం ఎప్పట్నుంచో జరుగుతున్నదే

kcr ktr harish rao కోసం చిత్ర ఫలితం


కేసీఆర్‌ తానుండగానే కొడుకు కేటీఆర్‌కు ఎలాంటి రాజకీయ ఇబ్బందులు లేకుండా చక్కదిద్దే ప్రయత్నంలోనే ఈ కార్యచరణకు దిగినట్లు హరీశ్‌ అభిమానులు ఆరోపిస్తున్నారుహరీశ్‌రావు ప్రాధాన్యత తగ్గించేందుకు ఆయన్ను కొన్ని ప్రాంతాలకే లేదా కొన్ని వర్గాలకే పరిమితం చేస్తూ వచ్చినా… ఆయన అభిమానగణం ఆయన్ను బాహుబలి రేంజ్‌లో అన్ని వర్గాలకు చేరువచేశారు

సంబంధిత చిత్రం


టీఆర్ఎస్‌ పార్టీ కేవలం కేటీఆర్‌ నాయకత్వంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ముందుకు పోవడంతోనే ఈ అనుమానాలకు బలం చేకూరిందిఆ విజయం కేటీఆర్‌ ప్రతిష్ఠ పెంచినా హరీశ్‌రావు అభిమానగణాన్ని తగ్గించలేకపోయిందితదుపరి వచ్చినా కొన్ని స్థానాల్లోని ఉప ఎన్నికల్లోనూ కేటీఆర్‌ కనుసన్నల్లోనే కార్యచరణ చేసి విజయం సాధించి మీడియాలో కేటీఆర్‌ను బాహుబలిగా చూపించినా… అసలుసిసలు అభిమానగణం ఉన్న బాహుబలిగా హరీశ్‌రావు ఎదుగుతూ వచ్చారు

సంబంధిత చిత్రం


పార్టీ అధికారంలోకి వచ్చిన తదుపరి హరీశ్‌ కు ఇస్తున్న ప్రాధాన్యంలో ఆయన అభిమానులెవరూ సంతృప్తిగా లేరన్నది వాస్తవంమరి ఇప్పుడు హరీశ్ ఏంచేస్తారు.. బీజేపీ ఆహ్వానాన్ని మన్నిస్తారా.. లేక తన కాలం వచ్చే వరకూ టీఆర్ఎస్‌ లోనే వేచి ఉంటారా..? ఏదేమైనా హరీశ్ వంటి నాయకుడికి ఇలాంటి కష్టకాలం.. అతని రాజకీయ పరిణితి పరీక్ష లాంటిదే.


మరింత సమాచారం తెలుసుకోండి: