ఈ మద్య దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య తీవ్రం అయ్యింది.  ప్రతిరోజూ ఎక్కడో పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. ప్రభుత్వాలు రోడ్డు భద్రతా చర్యలు ఎన్ని తీసుకుంటున్నా..ఈ ప్రమాదాల సంఖ్యను మాత్రం తగ్గించలేక పోతున్నాయి. తాజాగా రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకంది.   ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోని అంబవాలి గ్రామంలో ఓ పెళ్లి ఊరేగింపుపై ట్రక్కు దూసుకొచ్చిన ఘటనలో 13 మంది దుర్మరణం పాలవగా మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు.   

చనిపోయిన వారిలో నలుగురు చిన్నారు కూడా ఉన్నారు.  అప్పటి వరకు ఎంతో సంతోషంతో బంధుమిత్రులు సంబరాలు చేసుకుంటున్నారు.  ఈఘటనతో పెళ్లి ఊరేగింపు కాస్తా విషాదంగా మారింది. క్షతగాత్రులను చోటిసద్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఊరేగింపు చేస్తుండగా వెనుక వైపు నుంచి ట్రక్కు అదుపు తప్పి పెళ్లి ఊరేగింపు పైకి దూసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే పెళ్లి కుమార్తె రేఖను అక్కడి నుంచి తరలించారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: