‘తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో జగన్మోహన్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది’ ..ఇది తాజాగా జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్సులో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని చెప్పటంతో నేతలందరూ ఆశ్చర్యపోయారు. టిడిపి ప్రజా ప్రతినిధులు పార్టీకి రాజీనామాలు చేస్తుండటంతో ఫ్రస్ట్రేషన్ ఎవరిలో పెరిగిపోతోందో అందరూ చూస్తున్నదే. సందర్భం ఏదైనా సరే జగన్ ను అదేపనిగా తిడుతున్నదెవరూ అందరూ చూస్తున్నారు.

  

ప్రత్యర్ధిని అదేపనిగా తిడుతున్నారంటేనే చంద్రబాబులో ఏస్ధాయిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది అర్ధమైపోతోంది.  పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 22 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను చంద్రబాబు ప్రలోభాలకు గురిచేసి లాక్కున్నారు. అప్పుడు కూడా చంద్రబాబును జగన్ విమర్శించలేదు. బహిరంగ సభల్లోనో లేకపోతే పాదయాత్రలో సందర్భం వచ్చినపుడో అదీ కాకపోతే మీడియా సమావేశాల్లో ఎవరైనా ప్రశ్న వేసినపుడో మాత్రమే జగన్ ఫిరాయింపుల గురించి మాట్లాడేవారు.

 

కానీ ఇపుడు చంద్రబాబేం చేస్తున్నారు ? ప్రతీరోజు నేతలతో మాట్లాడేటపుడు, మీడియా సమావేశాలు పెట్టి, టెలికాన్ఫరెన్సుల్లోను జగన్ ను తిట్టని రోజుందా ? పైగా టిడిపి ఎంఎల్ఏలు, ఎంపిలు వెళ్ళిపోతున్నందుకు జగన్ తో పాటు మోడి, కెసియార్ కూడా కుట్రదారులుగా ముద్రేసి వాళ్ళని కూడా తిడుతున్నారు. టిడిపి నుండి వచ్చేసిన వాళ్ళంతా చంద్రబాబు అవినీతిని, అరాచకాన్ని, కులతత్వాన్ని ఎండగడుతుంటే వాటికి సమాధానాలు చెప్పకుండా జగన్, మోడి, కెసియార్ కుట్ర చేస్తున్నారంటే ఏమిటర్ధం? ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది ఎవరిలో ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: