ప్రజా ప్రతినిధి అంటే ప్రజలను కాపాడాలి..ప్రజలకు అండగా ఉండాలి..ప్రజలకు భరోసా ఇవ్వాలి..అలాంటి నాయకుడే ప్రజా ప్రతినిధి అవుతారు.  కానీ ఆంధ్రప్రదేశ్ లో కొండవీడులో జరిగిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  కొండవీడులో ముఖ్యమంత్రి సభా ప్రాంగణానికి సమీపంలో రైతు ఆత్మహత్యకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్.   నిన్న ముఖ్యమంత్రి హెలీకాఫ్టర్ దిగేందుకు కోటయ్య అనే రైతు పంటను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగగా పోలీసులు అతనిపై దారుణంగా  దాడి చేశారు.

ఈ సంఘ‌ట‌న జ‌రిగిన కొద్ది సేప‌టికే రైతు మ‌ర‌ణించాడు.. పోలీసులు కొట్ట‌డం వ‌ల్లే రైతు మ‌ర‌ణించాడంటూ కుటుంబ స‌భ్యులు ఆగ్ర‌హం వ‌క్తం చేశారు.   కోటయ్యను ఫిరంగిపురంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే పోలీసులు దెబ్బలకే కోటయ్య మృతి చెందాడని, వారే నోట్లో పురుగుల మందుపోసి ఆత్మహత్యగా చిత్రీకరించారని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు కోటయ్యకు చేదోడువాదోడుగా ఉండే తాతనబోయిన పున్నారావు కూడా పొలం వద్దకు వచ్చాడని, ఆయన మాత్రం కనిపించడం లేదని మృతుని కుమారుడు అంజి ఆవేదన వ్యక్తం చేశాడు.తమకు ఎవరితో కలహాలు లేవని పోలీసుల వల్లే తాము కుటుంబ పెద్దను కోల్పోయామంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్తులు సైతం పోలీసుల తీరును తప్పుబడుతున్నారు.  
Image result for కొండవీడు రైతు మృతి
తాజాగా దీనిపై స్పందించిన ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షులు జగన్  ‘‘కొండవీడులో ఒక బీసీ రైతు కోటయ్య గారిని మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారు.. కొట్టి కొనఊపిరితో ఉన్న రైతులను అమానుషంగా అక్కడే వదిలేశారు.  మీ హెలికాఫ్టర్ దిగటానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారు. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏమిటీ’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. చారిత్రాత్మక కొండవీడు కోటలో ఉత్సవాలకు ముఖ్యమంత్రి వస్తుండటంతో భద్రతా సిబ్బంది కఠిన చర్యలు చేపట్టారు.
Image result for కొండవీడు రైతు మృతి
ఇదిలా ఉంటే..  రైతు మరణవార్తను తెలుసుకున్న సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశాడు. పోలీసుల తీరుతోనా లేక ఇతర కారణాలతో కోటయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారా..? లేక మరేదైనా కారణం ఉందా అన్నది తేల్చాల్సిందిగా ఆదేశించారు.  ఆయన ఆత్మ శాంతించాల్సిందిగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం కోటయ్య కుటుంబానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: