కనీ వినీ ఎరుగని రీతిలో వైస్సార్సీపీ లోకి వలసలు జోరు సాగుతోంది. దీనితో వైసీపీ ఖుషిగా ఉంటె మరో పక్క అధికార పార్టీ జంపింగ్ చేసే ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో ఉంది. అయితే తరువాత ఎవరు అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి  నెలకొని ఉంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈసారి వంతు కాకినాడ ఎంపీ తోట నరసింహంది అని అంటున్నారు. తాజాగా చంద్రబాబుతో సమావేశం అయిన తోట నరసింహం తదుపరి సమావేశం జగన్ తోనే అనే టాక్ వినిపిస్తోంది.

తెలుగుదేశానికి.. మరో ఎంపీ ఝలక్?!

తోట నరసింహం వచ్చేసారి తనకు కాకినాడ ఎంపీ టికెట్ వద్దని అంటున్నారట. తనకు ఆరోగ్యం బాగోలేదని.. తను పోటీచేయడం లేదని.. తన భార్య జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటోందని.. ఆమెకు టికెట్ కేటాయించాలని ఈయన చంద్రబాబును కోరినట్టుగా తెలుస్తోంది. జగ్గంపేటలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జ్యోతులనెహ్రూ నెగ్గిన సంగతి తెలిసిందే.

ysrcp-jagan-chandra-babu

ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జ్యోతుల నెహ్రూను పక్కన పెట్టి... తోట నరసింహం కుటుంబానికి ప్రాధాన్యతను ఇస్తారా? అనేది సందేహంగానే కనిపిస్తోంది. ఒకవేళ తమకు జగ్గంపేట టికెట్ ఖరారు కాకపోతే.. తెలుగుదేశం పార్టీని వీడటానికి తోట నరసింహం కుటుంబం రెడీగా ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఎవరి మీద అయితే పార్టీ మారుతున్నారని ప్రచారం సాగుతుందో ఆశ్చర్యకరంగా వారందరు పార్టీ మారారు. చూడాలి ఇతను కూడా ఆపార్టీ మారతాడేమో ..!


మరింత సమాచారం తెలుసుకోండి: