ప్రస్తుతం మన రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఎన్నికల హడావిడి రాష్ట్రం మొత్తం అలుముకుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ ఆంధ్ర రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు.

Related image

ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గోన్న గల్ల జయదేవ్‌. కాగా నార్నె సంస్థల అధినేత నార్నె శ్రీనివాసరావు ఇటీవలే వైసీపీ అధినేత జగన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. వైసీపీలో ఆయన చేరతారని, గుంటూరు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది.

Related image

ఈ విషయమై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ని మీడియా ప్రశ్నించగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ తరపున మీపై నార్నె శ్రీనివాసరావు పోటీ చేస్తారని చెబుతున్నారని. అని అడగగా, ఎవరినైనా రానీయండి.

Related image

నేను మొదటిసారిగా ఇక్కడి నుంచి పోటీ చేసింది, విన్నింగ్ సీటు, విన్నింగ్ ప్లేస్ అని రాలేదు. గుంట.ూరు అంటే మా మామగారి ఊరు. కాబట్టి ఇక్కడికి వచ్చాను ఎన్నికలు ఎక్కడైనా కష్టంగానే ఉంటాయి. ముందు నుంచి కష్టపడితేనే గెలుపు వస్తుంది అని జయదేవ్ చెప్పుకొచ్చారు. మొత్తంమీద రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ గెలుస్తానని ధీమాగా తెలియజేశారు ఎంపీ గల్లా జయదేవ్.



మరింత సమాచారం తెలుసుకోండి: