ఏపీలో ఏం జరిగినా దాన్ని పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది.  ఇక ఏ మాత్రం వ్యతిరేకత వచ్చినా దాన్ని విపక్షాలపైన నెట్టే కార్యక్రమం చేస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఇక్కడ వారి కంటే బయట రాష్ట్రాల వారికి బాగా అర్ధమవుతున్నాయనుకోవాలి. 


జగన్ గెలవకూడదట :


వైసీపీ అధినేత జగన్ అంటే కాంగ్రెస్ కి పీకల మీద కోపం ఉంది. ఎందుకంటే ఆ పార్టీని కాదని ఆయన బయటకు వెళ్ళిపోయారు. మిగిలిన నాయకుల మాదిరిగా  ఫేడౌట్ అవలేదు సరికదా బలమైన నేతగా అవతరించి కొత్త పార్టీని పెట్టుకున్నారు. తెలుగు రాష్థాల‌ ప్రజల్లో కాంగ్రెస్ కు నామ రూపాలు లేకుండా చేయడంలో జగన్ పాత్ర అతి కీలకం. అందువల్లనే కాంగ్రెస్ నాయకులు జగన్ పేరు చెబితే ఉలిక్కిపడతారు. నలభయ్యేళ్ళ క్రితం రాజకీయ జన్మ ఇచ్చి మంత్రి పదవి అప్పచెప్పినా ఓడిపోయాక అదే  కాంగ్రెస్ ని  కాదని వెళ్ళిన చంద్రబాబు మాత్రం వారికి బాగా ముద్దు. ఇది ఇప్పటి దోస్తీ కాదని అటు కాంగ్రెస్, ఇటు చంద్రబాబు తరచూ చెబుతూ ఉంటారు కూడా. ఇంతకీ విషమేంటంటే ఏపీలో జగన్ గెలవకూడదుట. ఇది ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుని కోరిక.


అపశకునమేనా :


తెలంగాణాకు చెందిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి నిన్న అమరావతిలో చంద్రబాబుని కలసినపుడు జగన్ ఏపీలో గెలవకుండా చూడండని  కోరినట్లుగా టీడీపీ అనుకూల మీడియాలో వార్తా కధనం వచ్చింది. జగన్ ఏపీలో సీఎం అయితే అరాచకాలు పెరిగిపోతాయట. పైకి అలా చెబుతున్నా అసలు సంగతి ఏంటంటే తమని కాదని వెళ్ళిన జగన్ రాజకీయ జీవితం సర్వ నాశనం కాకుండా గొప్పగా ఉండడమే వారికి కంటగింపుగా ఉంది. ఆ విద్వేషంతో వచ్చిన మాటలే శశిధర్ రెడ్డి కామెంట్స్ గా చూడాలి. అయితే ఇక్కడ గురించాల్సిన విషయం కూడా మరోటి ఉంది. ఏపీలో గాలి మారుతోందని, అది జగన్ కి అనుకూలంగా ఉందని అందరికీ అర్ధమవుతోంది. 


జగన్ ఏపీలో స్వీప్ చేస్తారని రానున్న రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి అవడం ఖాయమని సర్వేలే కాదు, కాంగ్రెస్ జనాలు కూడా గుర్తించాయన్నమాట. కానీ ఎవరిని ఎవరూ ఇక్కడ ఆపలేరు. జనం ఓసారి నిర్ణయం తీసుకుని మాకు ఈ పార్టీ ఇష్టమని ఓటు వేయాలనుకుంటే ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆపలేరు. ఇంతటి  సీనియర్ నాయకుడు శశిధర్ రెడ్డికి ఆ విషయం తెలియకపోవడం విడ్డూరమే. ఆయన ఏకంగా బాబు వద్దకు వచ్చి జగన్ సీఎం కాకుండా ఆపాలని కోరడం వింత. బాబు టీడీపీ గెలుపు కోసమే పోరాడుతారు. అయినా ప్రజల తీర్పు నాయకుల చేతుల్లో ఉంటుందా..ఓ విధంగా జగన్ గెలుస్తున్నాడని బాబు టీడీపీకి  మర్రి వారు అపశకునం పలికారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: