కశ్మీర్‌లోని పుల్వామా దాడి ఘటన భారత్ - పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు రేపింది. ఈ ఘటనపై భారత్ తీవ్రంగానే స్పందించింది. పాకిస్థాన్ ప్రోద్బలంతోనే కశ్మీర్‌ లో తీవ్రవాదం ప్రబలుతోందని.. పాకిస్తానే తీవ్రవాదులను ఎగదోస్తోందని భారత్ స్పష్టంగానే చెబుతోంది.

india pulwama attack కోసం చిత్ర ఫలితం


అంతే కాదు.. ఇక మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అంటూ మోడీ సింహగర్జన చేసేశారు. పుల్వామా దాడికి కారణమైన వారు ఎక్కడున్నా వదలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. మరోసారి పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రయిక్స్ తరహాలో దాడులకు రంగం సిద్ధమవుతోందని కథనాలు వస్తున్నాయి కూడా.

సంబంధిత చిత్రం


ఈ సమయంలో పాకిస్తాన్ కూడా భారత్ కు దీటుగానే స్పందించింది. ఆధారాలు లేకుండా పాకిస్తాన్ పై అబాండాలు వేయొద్దంటోంది. భారత మీడియాలో, రాజకీయాల్లో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని, దాడులు చేయాలని చర్చ జరుగుతోందని విన్నాం... పాకిస్తాన్‌పై దాడి చేస్తే, పాకిస్తాన్ ఆలోచిస్తుందా, ఆలోచించదు.. పాకిస్తాన్ సమాధానం ఇస్తుంది అన్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

imran khan on pulwama కోసం చిత్ర ఫలితం


అంతే కాదు.. యుద్ధం ప్రారంభించడం సులభమే, కానీ, దానిని ముగించడం ఎవరి చేతుల్లోనూ ఉండదని మనందరికీ తెలుసు... ఇదంతా ఎటు దారితీస్తుందో ఆ అల్లాకే తెలియాలి.. అంటూ భారత్ ను పరోక్షంగా హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మరో సారి భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే పూర్తి స్థాయి యుద్దం వచ్చే అవకాశం లేదని.. పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: