ఏపీలో గాలి ఎటువైపు ఉంది. ఇది ఏ తీర్పు చెబుతుంది. దీని మీద ఎవరి వాదనలు వారికి ఉన్నాయి, నిన్నటికి నిన్న కాంగ్రెస్ హోదా యాత్రకు జనం దండిగా వచ్చారని చెప్పుకుంది. మరో వైపు బీజేపీ లాంటి పార్టీలు సైతం తమకే అంతా అనుకూలమని అంటాయి. ఎవరెన్ని చెప్పినా ఏపీలో ప్రధాన పోటీ మాత్రం వైసీపీ, టీడీపీల మధ్యనే ఉంటుంది. ఎందుకంటే మొత్తం అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయడమే కాదు. ఢీ అంటే ఢీ అంటున్న పార్టీలవి.


వార్ వన్ సైడ్ కావాలట :


టీడీపీ అధినేత చంద్రబాబు వార్ వన్ సైడ్ అవుతుందని గట్టిగా క్యాడర్ కి చెబుతున్నారు. ఏపీలో తాము అన్ని పనులు చేశామని, అందువల్ల జనం ఆదరిస్తారని ఆయన నమ్మకనగా అంటున్నారు. అంతా ధీమా ఉన్న చంద్రబాబు చివరి నిముషంలోనూ తాయిలాలు ఇంకా ఇస్తూనే ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకుంటే మరిన్ని హామీలు గుప్పించే వారే. జగన్ చెప్తునట్లుగా తనది కాని ఆరవ  బడ్జెట్లో కూడా వరాల వాన కురిపించారు. అన్నీ ఎందుకు చేస్తున్నట్లు. తన అయిదేళ్ళ పాలన బాగుందని చెప్పుకోవచ్చు కదా. దాన్ని చూపించే ఓట్లు అడగవచ్చు కదా. అంటే వార్ వన్ సైడ్ అంటే టీడీపీ పెద్దలకే విశ్వాసం అంతగా లేదనుకోవాలి.


వైసీపీది అదే మాట :


ఇక ఏపీలో వైసీపీ తీరు కూడా అలాగే ఉంది. వార్ వన్ సైడ్ అని. ఏపీలో అధికార పక్షం మరీ అంత హీనంగా లేదు. గత కాంగ్రెస్ పాలకుల్లాగా పొరపాట్లు ఎన్నికల విషయంలో బాబు అసలు చేయరు. ఆయన చివరి వరకూ పోరాడుతారు. గెలుపు కోసం ఆయన పడే తపన అంతా ఇంతా కాదు. పైగా పటిష్టమైన స్థితిలో టీడీపీ ఏపీవ్యాప్తంగా ఉంది. అన్ని చోట్లా క్యాడర్ ఉన్నారు. అయిదేళ్ళ పాలనలో టీడీపీ క్యాడర్ బాగానే బలం సంపాదించుకున్నారు. అందువల్ల వారు మళ్ళీ తమ పార్టీకి అధికారం కోరుకుంటారు.


అందుకోసం వారు పోరాడుతారు. ఇక వైసీపీకి వేవ్ అయితే ఉంది. దాన్ని ఓట్లుగా మార్చుకోవాలి. పైగా ఏపీలో బహు పార్టీల సమ్మేళంగా ఎన్నికల సీన్ కనిపిస్తోంది. కానీ ఫ్రంట్ రేసులో మాత్రం వైసీపీ ఉంటుంది. ఇప్పటికైతే ఇదే రాజకీయ ముఖచిత్రం. మొత్తం 175 సీట్లూ ఒకే పార్టీకి పడిపోయే పరిస్థితి లేదు. అటు బాబు అయినా, ఇటు జగన్ అయినా వార్ వన్ సైడ్ అంటే మాత్రం అది క్యాడర్ ని శాటిస్ఫై చేయడానికి అన్న కామెంట్స్ గానే చూడాలి.  ఏపీలో జనం మార్పు అయితే కోరుకుంటున్నారు. అది పక్కా నిజం.


మరింత సమాచారం తెలుసుకోండి: