అభియోగాలున్నంత మాత్రాన ఒకరు నేరస్తులు కాదు. అందుకే వారిని కోర్ట్ పరిభాషలో ముద్ధాయి అంటారు. అలాంటిది ప్రజలెన్నుకున్న ప్రతిపక్షనేత వైఎస్  జగన్మోహనరెడ్దిని నేరస్తుడని ముఖ్యమంత్రి సంభోదించటం అన్యాయం. అసలు ప్రజాధన దుబారా చేస్తూ ప్రజాధనాన్ని వినియోగించుకొని విలాసాలతో తేలియాడే నేటి ముఖ్యమంత్రి పై రేపు ఎన్నికల తరవాత నేరాభి యోగాల్లో చిక్కుకోరని గ్యారెంటీ ఉందా! భారత ప్రధాని నరెంద్ర మోడీ తనను అవినీతి కేసుల్లో ఇరికిస్తారని తనపై కేంద్ర నిఘాసంస్థలు దాడి చేయబోతున్నాయని తన ప్రజలు వలయంగా ఏర్పడి కాపాడాలని అభ్యర్ధించిన వ్యక్తి నేరస్తుడు కాదని గ్యారెంటీ ఉందా! అమరావతి మొత్తం అవినీతి కూపం అంటున్నారు. అలాగే పోలవరం కూడా! 


అసలు విషయమేమంటే నేరాలు తదనంతర లబ్ధే ఇప్పుడు వైసిపికి లభించిన రాజకీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దిక్కుతోచని స్థితిలో ఆ పార్టీ ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు పార్టీ నేతలతో ముఖ్యమంత్రి బుధవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నేరస్థులతో  సినీనటుల సమావేశం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బహుశ నిన్న అక్కినేని నాగార్జున జగన్మోహన రెడ్దిని కలిసిన సందర్భాన్ని ఉటంకిస్తూకావచ్చు  దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కేంద్రంగా ద్రోహ పూరిత "బ్లాక్ మెయిల్ పాలిటిక్స్" చేస్తున్నారని, వైసిపికి ప్రస్తుతం పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని ఆక్షేపించారు. ఆయన ఆక్షేపణ కూడా నిజమే ఎందుకంటే ఆయన కుటుంబమే ఆయన కులమే ఆంధ్రప్రదేశ్ లో అధికారం చలాయిస్తుంది కదా! 
jagan chandrababu rivalry కోసం చిత్ర ఫలితం
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో యాత్ర చేస్తోందని, రాష్ట్రంలో ఆ పార్టీ విషయంలో మనం స్పష్టత తో ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం మాత్రమే కేంద్రస్థాయిలో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. 


పుల్వామా దాడితో తమకు సంబంధం లేదని పాక్ స్పష్టం చేసిందన్నారు. ఈ విషయంలో రాజకీయ లబ్ధి దాగి ఉందా? అనే అనుమానం దేశవ్యాప్తంగా బలపడుతోందని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే, భాజపా రిమోట్ కంట్రోల్‌ లో ఉందని తెలిపారు. కృష్ణా జిల్లా నేతల్లో చాలా వరకూ గొడవలు లేకుండా ఎవరి పరిధి లో వారు పని చేసుకుంటున్నారని కితాబిచ్చారు. పేదల సంక్షేమానికి అందరూ కలిసి రావాలని సీఎం పిలుపు నిచ్చారు. పనిచేసే వారికే ప్రజా దీవెనలు ఇవ్వాలన్నారు. అదీ నిజమే 600 వాగ్ధానాలలో 60 నెరవేర్చగా జనం ఆ ప్రభుత్వాన్ని పనిచేసే ప్రభుత్వం అంటారో లేదో రెపు ఎన్నికలై పలితాలు వస్తే తెలుస్తుంది.  

india today latest survey 2019 andhra pradesh కోసం చిత్ర ఫలితం
మొన్నటి వరకు ప్రదాని నరేంద్ర మోడీ అంత గొప్ప ప్రదాని లేడన్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సోనియాగాందీని గాడ్సేతో పోల్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రివర్స్ లో ఎలా మాట్లాడు తున్నారో చూడండి "గోద్రాలో రెండు వేల మంది నరమేధాన్ని మరువలేం. విదేశాలు కూడా నరేంద్ర మోడీని బాయ్-కాట్ చేశాయి అని అన్నారు. ఎప్పుడో 2004 సంవత్సరం నాటి కథ ఎందుకు బాబు! నాడు మోడీ ఎంటీని నిషేధించిన అమెరికా ఆయనకు 2014 నుండి బ్రహ్మరథం పడుతుంది కదా! అంతెందు నాడు హైదరాబాద్ వస్తే జైల్లో వేస్తానన్న మీరే ఆయన డిల్లిలో ఉంటే 29 సార్లో 30 సార్లో తిరిగారు, స్నేహం చేశారు, సన్మానం చెశారు ...ఇంకా ఎన్నో!   


"సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వాల అస్థిరత ప్రమాదకరం. సరిహద్దు రాష్ట్రాలలో రాజకీయ లబ్దిని చూడరాదు. బిజెపి రాజకీయాలతోనే జమ్ము-కాశ్మీర్ లో సంక్షోభం. పుల్వామా దాడిపై మమతా బెనర్జీ అనుమానాలపై దేశంలో చర్చ. దేశభక్తి లో, భద్రతలో టిడిపి రాజీపడదు. రాజకీయ లబ్దికోసం దేశాన్ని తాకట్టు పెట్టడాన్ని సహించం" అని ఆయన వ్యాఖ్యానించారని మీడియా కధనం.

ఇండియాటుడే సర్వేః ఏపీ గ్రాఫ్స్ ఇలా!

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి  గ్రాఫ్ మరింతగా పెరిగిందని పేర్కొంది ఇండియా-టుడే. ఎన్నికల నేపథ్యంలో వివిధ సర్వేలు నిర్వహిస్తూ వస్తున్న ఈ ఇంగ్లిష్ వార్తా చానల్ తాజాగా ఏపీలో రాజకీయ పరిస్థితి గురించి తన అంచనాలను వెలువరించింది. వాటి ప్రకారం.. ఆరునెలల కిందటితో పోలిస్తే ఇప్పుడు వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్  మరింతగా పెరిగింది.


ఆరునెలల కిందట జగన్ కు 43శాతం మంది మద్దతు కనిపించిందని, గత ఏడాది సెప్టెంబర్లో ఆ పరిస్థితి ఉండగా, ఈ ఏడాది ప్రస్తుత నెల ఫిబ్రవరిలో జగన్ కు లభించిన మద్దతు శాతం 45 అని ఇండియా-టుడే పేర్కొంది. జగన్ గ్రాఫ్ లో రెండు శాతం పెరుగుదల నమోదైందని ఈ చానల్ పేర్కొంది. ఇదే సమయంలో ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత  చంద్రబాబు నాయుడి గ్రాఫ్ రెండుశాతం పతనం అయ్యిందని ఇండియా-టుడే వివరించింది. గత ఏడాది సెప్టెంబర్లో బాబుకు లభించిన మద్దతు శాతం 38 కాగా, ఇప్పుడు 36శాతం మంది మాత్రమే బాబును  సపోర్ట్ చేస్తున్నారని ఇండియా-టుడే పేర్కొంది.

india today latest survey 2019 andhra pradesh కోసం చిత్ర ఫలితం

ప్రస్తుతానికి జగన్ కు 45శాతం మద్దతు ఉండగా, బాబుకు 36 శాతం మంది మద్దతు ఉందని ఇండియా-టుడే వివరించింది.  వ్యత్యాసం తొమ్మిది శాతం అని పేర్కొంది. ఇక పవన్ గ్రాఫ్ లో ఒక శాతం తగ్గుదల నమోదైందని ఇండియా-టుడే వివరించింది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి పవన్ కు ఉండిన మద్దతు శాతం ఐదు కాగా,  ప్రస్తుతం పవన్ గ్రాఫ్  నాలుగు శాతం వద్ద ఉందని పేర్కొంది. ఇతరులకు ప్రస్తుతానికి 15శాతం మద్దతు ఉందని తమ సర్వేలో తేలినట్టుగా వివరించింది ఇండియాటుడే.


గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సాధించుకున్న ఓట్ల శాతం మధ్య తేడా అత్యల్పం అని.. అలాంటి చోట జగన్ తొమ్మిది శాతం లీడ్ లో ఉండటం వచ్చేసారి భారీ వ్యత్యాసం ఉండోబోతోందని చెప్పడానికి రుజువని ఆ చానల్ అభిప్రాయపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: