ప్రపంచంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొన్ని వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.  ముఖ్యంగా ఫన్నీ వీడియోలు..షాకింగ్ వీడియలో, కాంట్రవర్సీ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.  ఇక తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు.  కొన్ని సమస్యలు ఆయన ట్విట్టర్ ద్వారా తెలుసుకొని పరిష్కరించిన రోజులు కూడా ఉన్నాయి. 

తనకు ఇష్టమైన..ముఖ్యమైన ఫోటోలు, వీడియోలు ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తుంటారు కేటీఆర్.  తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ వేదికగా మరోసారి నవ్వులు పూయించారు. 

ఇద్దరు యువకులు ఓ కంచె వద్ద కర్ర సహాయంతో ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు..ఆ కర్ర లోపల పడిపోవడంతో మరో వ్యక్తి కంచె ఎక్కి ఆ కర్రను అందిస్తాడు..ఈ వీడియో చూస్తుంటే కడుపుబ్బా నవ్వొస్తుంది. 'స్మార్టెస్ట్‌ గై అవార్డు గోస్‌ టూ...' అంటూ కేటీఆర్  ఈ వీడియో షేర్ చేశారు.  మీరూ ఓ లుక్కేసి పక్కున నవ్వుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: