ఓడలు బండ్లవడం అంటే ఇదే! రిలయెన్స్ పేరు వింటే చాలు దేశం యావత్తూ అత్యంత ధనవంత కుటుంబమే గుర్తొస్తోంది.. ఫోర్బ్స్ జాబితాలో భారత్ నుంచి ఏటా స్థానం పొందుతున్న ఫ్యామిలీ అది. అయితే అంబానీ బ్రదర్స్ విడిపోయిన తర్వాత తమ్ముడు అనిల్ అంబానీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు. తాజాగా ఓ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు శిక్ష విధించింది.

 Image result for reliance communication

రిలయెన్స్ కమ్యూనికేషన్స్ – ఆర్.కామ్ అధినేత అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు జరిమానా విధించింది. అనిల్ అంబానీతో పాటు ఆ కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఇందుకు గానూ 4 వారాల్లో రూ.453 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ జరిమానా చెల్లించలేని పక్షంలో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తెలిపింది. అంతేకాక... సుప్రీంకోర్టు న్యాయ సహాయ విభాగానికి అనిల్ అంబానీకి చెందిన 3 కంపెనీలు కోటి రూపాయల చొప్పున 4 వారాల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. లేకుంటే నెల రోజుల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.

 Related image

తీర్పు నేపథ్యంలో గతంలో ఆర్.కామ్ పూచీకత్తుగా సమర్పించిన రూ.118 కోట్లను కంపెనీకి తిరిగి ఇచ్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎరిక్సన్ కంపెనీకి చెల్లించాల్సిన రూ.550 కోట్లను 4 నెలల్లోపు చెల్లించాలని రిలయెన్స్ కమ్యూనికేషన్స్ ను సుప్రీం ఆదేశించింది. గతంలో ఈ మొత్తాన్ని చెల్లించాలని సుప్రీం ఆదేశించగా.. గడువులోపు రిలయెన్స్ కమ్యూనికేషన్స్ చెల్లించలేకపోయింది. అయితే మరో 2 నెలలు అదనపు గడువు కూడా ఇచ్చింది. అప్పుడు కూడా ఆర్.కామ్ చెల్లించలేకపోవడంతో మరోసారి ఈ కేసు తెరమీదకు వచ్చింది.

 Image result for reliance communication

గతంలో రెండు సార్లు గడువు ఇచ్చినప్పటికీ నగదు చెల్లించకపోవడంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డబ్బు చెల్లిస్తామని జమ చేసిన పూచీకత్తు కూడా నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడింది. ఇది తమను నమ్మించి మోసం చేయడమేనని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు.. తాజాగా జరిమానా విధించింది. ఆర్.కామ్ చెప్పిన క్షమాపణలను కూడా తోసిపుచ్చింది. తాజా తీర్పుతో అనిల్ అంబానీ జరిమానా కట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. లేకుంటే జైలుశిక్ష అనుభవించక తప్పదు.

Image result for supreme court

అయితే రఫేల్ డీల్ లో అనిల్ అంబానీకి లబ్ది చేకూర్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారని కాంగ్రెస్ సహా యూపీఏ పక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు అనిల్ అంబానీకి శిక్ష విధించడంతో రఫేల్ డీల్ ప్రభావం మోదీ ప్రభుత్వంపైన పడుతుందేమోననే అనుమానాలు తలెత్తుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: