జాగ్వర్ లాండ్ రోవర్ (జె ఎల్ ఆర్) కొనగోలు చేసి ప్రపంచపు ఆటోమొబైల్ దిగ్గజమే అయ్యారు రతన్ టాటా! 1999లో రతన్ టాటా బృందానికి ఫోర్డ్ గ్రూప్ అధినేత బిల్ ఫోర్డ్ చేసిన అవమానానికి కొంత ఆగ్రహం తెచ్చుకున్నా దాన్ని లక్ష్యంగా మార్చుకొని 2008 లో అదే బిల్ ఫోర్డ్ కు అనితరసాధ్యమైన  సహాయం చేసి ఘన విజయం సాధించారు. 

ratan tata bill ford story కోసం చిత్ర ఫలితం 

తొమ్మిది సంవత్సరాల కాల చక్రభ్రమణంలో వారు వీరయ్యారు. 1999లో టాటాల పరిస్థితే 2008లో ఫోర్డ్ కు వచ్చింది. ఆయనపై ఆగ్రహానికి బదులుగా రతన్ టాటా సహాయం చేసి బదులు తీర్చుకున్నారు. అందుకే కారణజన్ములకు ఆగ్రహమొచ్చినా అనుగ్రహమొచ్చినా లోక కళ్యాణమే. 

 tata logo images కోసం చిత్ర ఫలితం

రతన్ టాటా భారత దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్ చైర్మన్. పద్మవిభూషణ్, పద్మ భూషణ్ వంటి అవార్డులు వరించాయి. అయితే ఈయనకు ఒకసారి అవమానం జరిగింది. అది కూడా ఒక విదేశీ కంపెనీ ఈయనను పరిహసించింది. 

సంబంధిత చిత్రం 

అది 1998 సంవత్సరం. టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ల విభాగంలోకి ప్రవేశించింది. కంపెనీ అదే సంవత్సరం పూర్తిగా భారత్‌లో తయారైన తొలి ప్యాసింజర్ కారు ‘ఇండికా’ను మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ కారు తొలి ఏడాది కస్టమర్లను ఆకట్టుకోలేక పోయింది. 

bill ford కోసం చిత్ర ఫలితం

టాటా ఇండికా నిరుత్సాహ పరచడంతో కంపెనీ ఈ ప్యాసింజర్ కార్ల వ్యాపారాన్ని వేరే కంపెనీకి విక్రయించా లని భావించింది. టాటా మోటార్స్ అధికారులు ఈ విషయాన్ని రతన్ టాటాకు నివేదించారు. ఆఖరికి రతన్ టాటా కూడా ప్యాసింజర్ కార్ల వ్యాపారాన్ని విక్రయించేందుకు సిద్దమయ్యారు. 
ford car company owner కోసం చిత్ర ఫలితం

ఈ నేపథ్యంలోనే ‘గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్‌’ కు తన ప్యాసింజర్ కార్ల వ్యాపారాన్ని విక్రయించాలని టాటా గ్రూప్ భావించింది. ఫోర్డ్ కూడా ఈ డీల్‌ పై ఆసక్తి కనబరచింది. డీల్‌ పై చర్చలు జరిపేందుకు ఇరు కంపెనీల ప్రతినిధులు న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. టాటా గ్రూప్ నుంచి రతన్ టాటా, కంపెనీ ఇతర ప్రతినిధులు ఫోర్డ్ నుంచి బిల్ ఫోర్డ్, కంపెనీ ఇతర ప్రతినిధులు ఈ మీటింగ్‌కు హజరయ్యారు. ఈ సమావేశం ఏకంగా మూడు గంటలపాటు జరిగింది. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫోర్డ్ కంపెనీ ప్రతినిధులు టాటా మోటార్స్ ప్రతినిధులను చిన్న చూపు చూశారు. వారి ప్రవర్తన మన వారికే నచ్చలేదు.

 

సమావేశంలో ఫోర్డ్ చైర్మన్ బిల్ ఫోర్డ్ ‘ప్యాసింజర్ కార్ల వ్యాపారం గురించి తెలియనప్పుడు మీరెందుకు ఈ విభాగంలోకి ప్రవేశించారు. ఒకవేళ మేం మీ వద్ద నుంచి ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తే అది మాకు ప్రయోజనకరమే’ అని రతన్ టాటాతో అన్నారు. దీంతో రతన టాటా డీల్ వద్దను కొని, స్వదేశానికి బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో బిల్ ఫోర్డ్ మాటలే ఆయనకు గుర్తుకు వచ్చాయి. వీటిని అవమానకరంగా భావించి బాధపడ్డారు. కాలచక్రం గిర్రున తిరిగింది. 2008లో ఫోర్డ్ కంపెనీ దివాలా అంచులకు చేరుకుంది. తన లగ్జరీ కారు బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొనుగోలు చేయాలని టాటా గ్రూప్ దగ్గరకు వచ్చింది. 

ford and jaguar land rover కోసం చిత్ర ఫలితం

బిల్ ఫోర్డ్ తన టీమ్‌తో ముంబై వచ్చారు. డీల్ గురించి టాటా గ్రూప్‌తో చర్చలు ప్రారంభించారు. సమావేశం లో బిల్ ఫోర్ట్, రతన్ టాటాతో ‘జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొనుగోలు చేస్తూ మీరు మాకు పెద్ద ఉపకారం చేస్తున్నారు’ అని అన్నారు. డీల్ ఓకే అయ్యింది. దీని విలువ $ 2.3 బిలియన్ డాలర్లు. అంటే ఆ కాలం లోనే దాదాపు ₹9,300 కోట్లు.
ratan tata bill ford story కోసం చిత్ర ఫలితం

ప్రస్తుతం జాగ్వార్ ల్యాండ్ రోవర్ టాటాగ్రూప్ సొంతం. కంపెనీకి లాభాలను తెచ్చి పెడుతోంది. ఎవరైనా మనల్ని అవమానిస్తే సాధారణంగా కోపం వస్తుంది. కానీ గొప్పవారు ఈ కోపాన్ని లక్ష్యాలను సాధించు కోవడానికి ఉపయోగించు కుంటారు. ఇందుకు ఉదాహరణ రతన్ టాటా. 

మరింత సమాచారం తెలుసుకోండి: