ఎన్నికలు తరుముకొస్తున్నాయి. సాధ్యమైనంతవరకు ప్రజలతో రాజకీయ నాయకులు స్నేహంగా ఉండాల్సిన సమయమిది. బుద్ది ఉన్నోళ్లు ఎవ‌రూ ఎన్నిక‌ల వేళ ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్యాఖ్య‌లు చేయ‌రు వివాదాస్పధమైన పనులుతలపెట్టరు. నోటి దురుసున్న నేతలుసైతం ఎన్నిక‌లవేళ‌ ఆచితూచి కొండొకచో తగ్గికూడా మాట్లాడ‌తారు. నోరు జారేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు.
అయితే కొందరికి ఈసూత్రాలు వర్తించవు. అహంకారానికి నిలువెత్తురూపంగా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు అభివ‌ర్ణించే దెందులూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఈ సంస్కారం సాంప్రదాయం నచ్చవు. ఆయన తాజాగా దళితు లపై చేసిన దుర్మార్గపు వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగానే కాదు భయంకరంగా మారాయి.

chintamaneni prabhakar unpaliamentary comments on dalits కోసం చిత్ర ఫలితం

నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం, తానేం మాట్లాడినా, తానేం చేసినా సీఎం సైతం ఏమీ చేయ‌ర‌న్న ధీమానో, మ‌రో కార‌ణ‌మో కానీ ఆయ‌న తాజాగా విచ్చలవిడి మాట‌ల‌తో సభ్య సమాజంలో ఉన్నానన్న ఇంగితం మరచి చెల‌రేగిపోయారు. వెనుక‌బ‌డిన వారిని ద‌ళితుల్నిఉద్దేశించి ఆయ‌న చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియా లో వైర‌ల్ గా మారాయి. 

సంబంధిత చిత్రం
ప‌ద‌వులు, రాజ‌కీయాలు త‌మ‌కేన‌ని, మీకెందుకురా! పిచ్చ * * * కొడ‌క‌ల్లారా? అంటూ దారుణ‌మైన బూతు భాషా పాండిత్యాన్ని తన సహజ అహంకారానికి కలిపి ప్ర‌ద‌ర్శించిన రక్షస స్వరూపం చింత‌మ‌నేని! అధికార బ‌లుపును చూపించార‌న్న విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున వ్య‌క్త‌మ‌వు తున్నాయి. గ‌త నెల మొద‌టి వారంలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు మండ‌లం శ్రీ‌రామ‌వ‌రంలో నిర్వ‌హించిన ఒక కార్య‌క్ర‌మంలో చింత‌మ‌నేని పాల్గొన్నారు. ఆ సంద‌ర్భంలో నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడిన ఆయ‌న మాట‌ల వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 
చింత‌మ‌నేని మాట్లాడే స‌మ‌యంలో ఒక ద‌ళితుడు తాను మాట్లాడ‌తాన‌ని, మైకు అడ‌గ‌టంతో ఈ అధికార పార్టీ శాసనసభ్యుడు ఆగ్ర‌హంతో ఊగిపోయారు.
chintamaneni prabhakar attrocities on women and dalits కోసం చిత్ర ఫలితం
అస‌భ్య‌ అభ్యంత‌ర‌క‌ర భాషా పాండిత్యం తో వ్యాఖ్య‌లు చేస్తూ చెల‌రేగిపోయారు. మొన్న వైసిపి అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌నరెడ్డి వ‌చ్చి న‌ప్పుడు నేను కావాలంటే అడ్డుకునేవాడిని క‌దా? నేను మాట్లాడానా? అప్పుడు గొడ‌వ ప‌డితే మీరు రారా? అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు వీడు మాట్లాడ‌తానంటూ మైకు అడుగుతున్నాడంటూ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయంగా మీరు ఒక్క‌టి గుర్తు పెట్టుకోండి. మీరు ద‌ళితులు మీరు వెనుక‌బ‌డిన వారు. మీరు షెడ్యూల్ కులానికి చెందిన వారు. రాజ‌కీయాలు మాకుంటాయి. మాకు ప‌ద‌వులు. మీకెందుకురా పిచ్చ‌*** కొడ‌క‌ల్లారా! కొట్లాట అంటూ ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్యాఖ్య‌లు చేస్తున్న వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ గా మారింది. 
chintamaneni prabhakar attrocities on women and dalits కోసం చిత్ర ఫలితం
ఈ వీడియోపై ద‌ళిత స‌మాజం ఆగ్ర‌హంతో ఊగిపోవ‌ట‌మే కాదు, చింత‌మ‌నేని తీరును వారు తీవ్రంగా పరిగణిస్తూ ఆయన్ని మనిషిగా కూడా వ్య‌తిరేకిస్తున్నారు. ఈయన అవక్ర విక్రమ బూతు భాషా పాండిత్యం దెబ్బకు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఖచ్చితంగా శకరగిరిమాన్యాలు పట్టటం ఖాయం అనిపిస్తుంది.

TDP MLA chintamaneni prabhakar atrocities కోసం చిత్ర ఫలితం

TDP Peoples Representative 5 Kauravas connected in assault against Women

గతంలో ఇదే చింతమనేని ప్రభాకర్‌ ఒక నిరుపేద వృద్ధునిపై రెచ్చి పోయారు. పింఛన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధుడిపై బూతుపురాణం అందుకున్నారు. దెందులూరు నియోజకవర్గం విజరాయి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. పింఛన్‌ తీసుకోవడానికి వచ్చిన 75 ఏళ్ల సుబ్బారావు పై చింతమనేని ఒక్కసారిగా రెచ్చిపోయారు. ‘నీ కొడుకులు వైఎస్సార్‌సీపీలో తిరుగుతుంటే పింఛన్‌ తీసుకోవడానికి నీకు సిగ్గు లేదా? అంటూ చింతమనేని వృద్ధుడిపై విరుచుకుపడ్డారు. తన తండ్రిని అవమానించటంపై అక్కడే ఉన్న సుబ్బారావు కొడుకులు నిలదీయడంతో చింతమనేని దౌర్జన్యానికి దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: