ప్రముఖ వ్యాపార చిగురుపాటి జయరాం హత్య కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది.  ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అయిదుగురు పోలీసు అధికారులను ఎసిపి కార్యాలయంలో అధికారులు బుధవారం ప్రశ్నించారు.  జయరాం హత్యకేసులో పోలీసు అధికారుల విచారణ ముగిసింది. మూడున్నర గంటల పాటు ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాస్‌ను దర్యాప్తు అధికారి కేఎస్ రావ్ ప్రశ్నించారు. రాకేశ్ రెడ్డి సమాధానాలు, పోలీసుల సమాధానాలను అధికారులు బేరీజు వేసుకుంటున్నారు.

ఈసందర్భంగా డీసీపీ శ్రీనివాస్ జయరాం హత్య కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.  హత్యను యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని ఓ పోలీస్‌, రాకేష్‌ రెడ్డికి ఫోన్లో సలహా ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.  ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాస్‌, రాంబాబును ప్రశ్నించినట్టు చెప్పారు.
Image result for జయరాం కేసులో విచారణ
జయరాం హత్య జరగకముందు… జరిగిన తర్వాత… కాల్‌ డేటా ఆధారంగా వారిని విచారించామన్నారు.  స్నేహితుల మధ్య జరిగిన విషయాన్ని మాత్రమే రాకేశ్ రెడ్డి తనకు చెప్పాడని… ఏసీపీ మల్లారెడ్డి విచారణలో వెల్లడించారన్నారు. ఈ కేసులో సినీ నటుడు సూర్యని కూడా విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 50 మందిని పోలీసులు ప్రశ్నించారు.
Image result for kuna srisailam goud
 తాజాగా ఈ కేసులో కాంగ్రెస్ నేత కూన శ్రీశైలంగౌడ్ ను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రాకేష్ రెడ్డి తో కూనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఎల్లుండి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.  విచారణ పారదర్శకంగా జరుగుతోందని… హత్య కేసులో పోలీసుల పాత్ర ఉందని తెలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాని ఆయన తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: