ఓటుకు నోటు కేసు విచారణ జోరుగా సాగుతోంది. ఈడీ ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ మరోసారి సుదీర్ఘంగా విచారిస్తోంది. మొన్న వేం నరేందర్ రెడ్డి.. నిన్న ఉదయ సింహా.. ఇప్పుడు రేవంత్ రెడ్డి.. ఇలా అందరినీ మరింత లోతుగా ప్రశ్నిస్తోంది.

సంబంధిత చిత్రం


అయితే ఈ విచారణ అంతా ఏపీ సీఎంను టార్గెట్ చేస్తూనే జరుగుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. నిన్న రేవంత్ రెడ్డిని దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి.. చంద్రబాబును టార్గెట్ చేసుకునే ఈడీ విచారణ సాగుతోందన్నారు.

chandrababu note for vote case కోసం చిత్ర ఫలితం


అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగి విసిగిస్తున్నారని.. చంద్రబాబును రాజకీయంగా ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యంతోనే 50లక్షల రూపాయల చుట్టూ ప్రశ్నలు వేస్తున్నారని రేవంత్ అంటున్నారురేవంత్ వాదన నిజమే అయితే ఏపీ రాజకీయాల్లో సంచలనాలు ఖాయంగా ఉండొచ్చు.

chandrababu note for vote case కోసం చిత్ర ఫలితం


రేవంత్ రెడ్డి కేసులో చంద్రబాబు ఆడియో రికార్డులు కూడా నిజమేనని గతంలో ఫోరెన్సిక్ నివేదికలు చెప్పాయి. మరి ఇప్పుడు రేవంత్ తదితరుల వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబును సరిగ్గా ఎన్నికల ముందు ఇబ్బంది పెడతారా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. కానీ ఎన్నికల ముందు ఇలాంటి చర్యలు ఆ పార్టీకే సానుభూతి తెస్తాయి కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: