ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా దగా అవుతూ వస్తోంది. నిజానికి ఉత్తరాంధ్రలో రాజకీయ చైతన్యం తక్కువ అన్న అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. కానీ అది నిజం కాదు, ఉత్తరాంధ్రా ఎన్నో కీలకమైన పోరాటాలకు నాంది పలికింది. ఎన్నో రాజకీయ మలుపులకు కేంద్ర బిందువుగా మారింది. అటువంటి ఉత్తరాంధ్ర ఇపుడు రేపటి ఏపీ రాజకీయాన్ని మార్చనుందా...


గాజువాకలో గాజు గ్లాస్ :


విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేసేందుకు జనసెన అధిపతి పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారని అంటున్నారు. దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా గాజువాకలో పార్టీ సభ్యత్వాల సంఖ్య లక్ష మార్క్ దాటిందని.. ఇక్కడ పోటీ చేయడం ద్వారా.. పవన్ రికార్డ్ మెజారిటీతో నెగ్గడం ఖాయమని ఒక అంచనా బలపడిపోయింది. గోదావరి జిల్లాల్లో పోటీ చేస్తే అక్కడున్న కాపు ఓటు బ్యాంకు బలపడవచ్చని మరికొందరు సూచించినా, చివరకు గాజువాక ఫైనల్ అవడం ఖాయమని తెలుస్తోంది. గతంలో ప్రజారాజ్యం సీజన్లో కూడా విశాఖ జిల్లా నుంచి చిరంజీవికి మంచి ఆదరణ లభించింది. వచ్చే వారంలో గాజువాకకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు.


ఊపు వస్తుందా :


ఇదిలా ఉండగా పవన్ గాజువాక నుంచి పోటీ చేస్తే ఆ వూపు ఉత్తరాంధ్రా జిల్లాలపై బాగా పడుతుందని, ఫలితంగా ఎక్కువ సీట్లు ఇక్కడ గెలుచుకునే వీలు ఉంటుందని పవన్ పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. గతంలో ప్రజారాజ్యం టైంలో కూడా ఒక్క విశాఖలోనే నాలుగు సీట్లు సాధించిన చరిత్రను గుర్తు ఉండే ఉంటుంది. అదే విధంగా తమ పార్టీకి కూడా శుభారంభం విశాఖ జిల్లాతోనే అన్న సెంటిమెంట్ తో జనసేనాని ఇక్కడ నుంచి పోటీకి రెడీ అవుతున్నారని అంటున్నారు. తొందరలోనే తొలి జాబితా వస్తుందని, అందులో పవన్ గాజువాక నుంచి పోటీ కూడా ఉంటుందని అంటున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: