స్నేహం జీవన గీతానికి ఫల్లవి – స్నేహం జీవితాలను మోసే పల్లకి” అంటారు మహనీయులు. దానికి మతం కులం జెండర్ ప్రాంతం తరతమ భేదాలుండవు. ఆ స్నెహాన్ని పురస్కరించు కొనే సౌదీ భారత్ విషయంలో అభినందనీయ నిర్ణయం తీసుకుంది. నిజంగా చెప్పాలంటే ఇది ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ విధాన నిర్ణయ ప్రభావమే. 


తద్వారా - భారత్‌ లో భారీగా పెట్టుబడులకు ముందు కొచ్చింది సౌదీ అరేబియా. రానున్న రోజుల్లో ₹ 7లక్షల కోట్ల (100 బిలియన్ డాలర్లు) మేర పెట్టుబడులకు పెట్టనున్నట్లు హామీ ఇచ్చింది. భారత్‌ లో పర్యటిస్తున్న సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఈ మేరకు ప్రకటన చేశారు. విద్యుత్, పెట్రో కెమికల్, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఉత్పత్తి, శుద్ధీకరణ రంగాల్లో ఈ పెట్టుబడు ఉంటాయని తెలిపారు. సౌదీ నిర్ణయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. భారత ఆర్థిక వ్యవస్థ పట్ల నమ్మకముంచినందుకు ధన్యవాదాలు తెలిపారు.
modi meeting with saudi prince కోసం చిత్ర ఫలితం
అంతకు ముందు ఢిల్లీలో ప్రధాని మోదీ, సౌదీ యువరాజు మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఉగ్రవాదం సహా పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి మీడియా
సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడిని ప్రస్తావించారు ప్రధాని మోదీ. ఉగ్రవాదానికి సహకరిస్తున్న దేశాలపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంద న్నారు మోదీ. 


మానవాళికి వ్యతిరేకంగా జరుగుతున్న వినాశనానికి పుల్వామా ఉగ్రదాడి కౄర చిహ్నంగా నిలిచింది. ఈ ముప్పును ఎదుర్కోవాలంటే తీవ్రవాదాన్ని సమర్థిస్తున్న దేశాలపై అన్నిరకాల ఒత్తిడులు పెంచాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాద సంస్థల మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయడం, వారి మద్దతు లేకుండా చేయడం, ఉగ్రవాదులకు, వారి మద్దతుదారులకు శిక్ష పడేలా చేయడం చాలా అవసరం. టెర్రరిజానికి బలమైన కార్యాచరణ రూపొందించాలి. ఉగ్రవాద నిర్మూలనపై సౌదీ అరేబియా, భారత్ తమ ఆలోచనలు పంచుకోవడం సంతోషంగా ఉంది.

ప్రధాని మోదీ తనకు పెద్దన్నయ్య అని భారత్-సౌదీ అరేబియా అన్నదమ్ముల్లాంటివి అని అని ఆయన అన్నారు ఇంధన, పర్యాటక, సాంస్కృతిక, లేదా మౌలిక సదుపాయాలు లాంటి రంగాల్లో మాకు భాగస్వామ్యం ఉంది. ఇప్పటికీ ఆయా రంగాల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. 


ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌, సౌదీ అరేబియాది ఒకే విధానం. ఉగ్రవాద నిర్మూలన విషయం లో నిఘా సమాచారంతో పాటు భారత్‌కు పూర్తి సహకారం అందిస్తాం. అందరితో కలిసి పనిచేస్తే నే, రాబోయే తరాల వారికి మెరుగైన భవిష్యత్తు ఉంటుంది.
modi meeting with saudi prince కోసం చిత్ర ఫలితం
కాగా, భారత్‌కు ముందు సౌదీ యువరాజు పాకిస్తాన్‌ లో పర్యటించారు. పాక్‌ లో ₹ 140000 కోట్లు (20 బిలియన్ డాలర్లు) మేర పెట్టుబడులకు హామీ ఇచ్చారు. పెట్రో కెమికల్స్, క్రీడలు, సౌదీ ఉత్పత్తుల దిగుమతులు, పవర్ ప్రాజెక్టులు, రెనెవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల ఆధునీకరణ వంటి అంశాలపై పాక్ ప్రధానితో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతరం అక్కడి నుంచి చేరుగా భారత్‌కు వచ్చారు సౌదీ యువరాజు. ఢిల్లీలో ఘన స్వాగతం లభించిన విషయం తెలిసిందే. ప్రొటోకాల్‌ ను సైతం పక్కనబెట్టి ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలకడంపై విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ టిఎంసి టిడిపి మండిపడ్డాయి. ఐతే పాకిస్తాన్‌లో ప్రకటించిన దాని కంటే 5 రెట్లు ఎక్కువగా భారత్ పెట్టుబడులు పెడతామని సౌదీ అరేబియా చెప్పడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: