త‌న్నీరు హ‌రీష్‌రావు. తెలంగాణా ఉద్య‌మ సార‌ధి, ప్ర‌స్తుత సీఎం కేసీఆర్‌కు మేన‌ల్లుగానే రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. త‌న‌కం టూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. సిద్దిపేట అసెంబ్లీ నియోజ‌వ‌కర్గం నుంచి వ‌రుస విజయాల‌తో స‌ర్వ శ‌క్తుమంతుడ‌నే విష‌యాన్ని చాటుకుంటున్నారు. గ‌త ఏడాది డిసెంబ‌రులో జ‌రిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ సిద్దిపేట నుంచి ల‌క్ష‌కు పైబ‌డిన మెజారిటీతో విజ‌యం సాధించారు.వాస్త‌వానికి ఆయ‌న‌కు ప్ర‌జ‌లు ఏ రేంజ్‌లో బ్ర‌హ్మర‌థం ప‌ట్టారో తెలిసిందే. ప్ర‌తి ఒక్క‌రూ హ‌రీష్‌కు తోడుగా ఉన్నారు. అయితే, ఇప్పుడు ఆయ‌న ప‌రిస్థితి ఏంటి?  తెలంగాణ ఉద్య‌మం నాటి నుంచి నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా పార్టీని ముందుండి న‌డిపించిన హ‌రీష్ కు ఇప్పుడు అదే పార్టీలో ఎద‌ర‌వుతున్న ప‌రిస్థితి ఏంటి? 

Image result for kcr ktr

ఇప్పుడు ఇదేఅంశం తెలంగాణాలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం. గ‌త ప్ర‌భుత్వం నీటి పారుదల మంత్రిగా హ‌రీష్ వ్య‌వ‌హ‌రించారు. అప్ప‌ట్లోనే దీనిని అప్రాధాన్య శాఖ‌గా అంద‌రూ విమ‌ర్శించారు. ఉద్దేశ పూర్వకంగాను, త‌న కుమారుడు కేటీఆర్ అభ్యున్న‌తికి ఎక్క‌డ అడ్డం  వ‌స్తాడోన‌ని భావించే కేసీఆర్ త‌న సొంత మేన‌ల్లుడు హ‌రీష్‌ను తొక్కేస్తున్నాడ‌ని  అప్ప‌ట్లోనే ప్ర‌చారం జ‌రిగింది. ఇక‌, ఇప్పుడు తాజాగా మంత్రి వ‌ర్గాన్నివిస్త‌రించారు. ఈ విస్త‌ర‌ణ‌లో హ‌రీష్‌కు ఎలాంటి శాఖ‌ను కేటాయించ‌లేదు. క‌నీసం ఆయ‌న పేరును ప‌రిశీల‌న‌కు కూడా తీసుకోలేదు. దీంతో హ‌రీష్ అనుచ‌రులే కాకుండా పార్టీలోని హ‌రీష్ వ‌ర్గంగా పేర్కొనే ఓ ప‌దిమంది ఎమ్మెల్యేలు సైతం నిశ్చేష్టుల‌య్యారు. 

Image result for kcr ktr

అయితే,  తనకు అసంతృప్తి లాంటిదేమీ లేదంటూ హరీష్ రావు వివరణ ఇచ్చినప్పటికీ, తమ నేతకు ప్రాధాన్యత తగ్గు తోందని వారు ఆందోళన చెందుతున్నారు. హరీష్ రావును పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో దింపి పార్లమెంట్ కు పంపే యోచనలో కేసీఆర్ ఉన్నారని ఉహాగానాలు వస్తున్న తరుణంలో ఇక రాష్ట్ర రాజకీయాల్లో హరీష్ రావుకు ప్రాధాన్యం ఉండబోదని అనుచరులు ఆందోళన చెందుతున్నారు. మంత్రివర్గం ఏర్పాటు తర్వాత చోటు చేసుకుం టున్న పరిణామాలు వారి ఆందోళనను మరింత పెంచుతున్నాయి, కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చూసినవారంతా వరుసగా ఎంపీ కవితతో సమావేశం అవుతున్నారు. 


దీంతో కవిత కొత్త పవర్ సెంటర్ గా ఎదుగుతున్నారా? అన్న అనుమానాలు మొదలవుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కానీ కేసీఆర్ తర్వాత అంతా హరీష్ రావే అన్నట్లు ఉండేది పరిస్థితి. కానీ, క్రమ క్రమంగా కేటీఆర్, కవితలు ఎంటర్ అయ్యి తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా ఎదగటం మొదలుపెట్టారు. ఆ మధ్య కేటీఆర్ కు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినప్పటి నుండి హరీష్ రావు ప్రాధాన్యం తగ్గుతోందని ఆయన అనుచరులు వాదిస్తున్నారు, ఇప్పుడు మంత్రులంతా కవితను కలవటం చూసి పార్టీలో కవిత కొత్త పవర్ సెంటర్ గా మారుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇక హ‌రీష్‌పార్టీ మారుడో లేక‌.. సొంత పార్టీ పెట్టుడుగానే అడుగులు వేయాల‌ని సూచిస్తున్నారు. మ‌రి రాబోయే రోజుల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: