ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో మోదీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై టైమ్స్ గ్రూప్ ఆన్‌-లైన్‌ పోల్ చేపట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధానిగా నరేంద్ర మోదీని ఎన్నుకుంటామని 84 శాతం మంది తెలిపారు.  టైమ్స్ గ్రూప్ ఫిబ్రవరి 11నుంచి 20వ తేదీ వరకు 9భాషల్లో, 13 మీడియా ప్రాపర్టీస్‌ లో ఈ మెగా ఆన్‌-లైన్‌ పోల్‌ను నిర్వహించింది. ఓటింగ్‌ ప్రభావితం కాకుండా ఉండటం కోసం పోల్ చేపట్టిన పది రోజులపాటు ఫలితాలు బయటకు తెలియకుండా గోప్యత పాటించారు. ఈ సర్వేలో 5 లక్షల మందికి పైగా పాల్గొనగా, ఒక వ్యక్తి ఒక్కసారి మాత్రమే పోల్‌ లో పాల్గొన్నాడని నిర్థారించుకోవడం కోసం లాగిన్ అయిన యూజర్ల ఓట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.  ఈ మెగా ఆన్‌-లైన్ పోల్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.



ఎన్నికలతర్వాత నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని ఈ పోల్‌ లో పాల్గొన్న వారిలో 83 శాతం మంది అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా  ఐదు లక్షల మందికి పైగా ఈ పోల్‌ లో పాల్గొన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధానిగా మోదీని ఎన్నుకుంటామని 84 శాతం మంది తెలిపారు. ప్రధానిగా రాహుల్ అభ్యర్థిత్వం పట్ల 8.33 శాతం మంది మాత్రమే సుముఖంగా ఉన్నారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని కావాలని 1.44 శాతం, మాయావతి పీఎం కావాలని 0.43 శాతం మంది ఆశిస్తుండగా,  ఇతరులు ప్రధాని పీఠంపై కూర్చోవాలని 5.9 శాతం మంది భావిస్తున్నారు. 
times mega poll results కోసం చిత్ర ఫలితం
2014 తో పోలిస్తే రాహుల్ పాపులారిటీ పెరిగిందా? అనే ప్రశ్నకు 31 శాతం మంది సానుకూలంగా స్పందించారు. 63 శాతం మంది పెరగలేదని చెప్పడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్డీయే, యూపీఏ యేతర కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని 3.47 శాతం మాత్రమే అభిప్రాయ పడ్డారు. 


లోక్ సభ ఎన్నికల తరవాత ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నదానికి మోదీ నాయకత్వం లోని ఎన్ డీఏ అంటూ 83 శాతం రాహుల్ సారధ్యంలోని యుపిఏ 9 శాతం మోడి లేని ఎన్ డీఏ 4.25 శాతం మహాఘట్భంధన్ 3.50 శాతం అని తేల్చారు. 
times mega poll results కోసం చిత్ర ఫలితం
మోదీ ఐదేళ్ల పాలన ఎలా ఉంది అన్నదానికి చాలా బాగుంది 59.50 శాతం అని బాగుంది అని 22.30 శాతం బాగాలేదు అని 9.94 శాతం పర్వాలెదు అని 8.25 శాతం అభిప్రాయం వ్యక్తం చేశారు. 


మోడీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం అన్నదానికి - పేదలకు మెరుగైన సేవలు 34.39 శాతం, జి ఎస్ టి 29.09 శాతం, స్వచ్చ భారత్ 18.68 శాతం సర్జికల్ దాడులు 17.84 శాతం అని చెప్పారు. 
times mega poll results కోసం చిత్ర ఫలితం
మోదీ ప్రభుత్వ అతి పెద్ద వైఫల్యం అంటే అభివృద్ధిలేని రామ మందిర నిర్మాణం 35.72, ఉద్యోగాల కల్పన 29.52, నోట్ల రద్ధు 13.50, అసహనం పెరగటం 12.97 ఇతర కారణాలు 8.29 శాతం అని తెలిపారు. 


రానున్న ఎన్నికల్లో మీకు సంభంధించి అతిపెద్ద సమస్య అన్నదానికి ఉద్యొగాలు 40.21, రైతుల కష్టాలు 21.82, రామమందిర నిర్మాణం 10.16 జిఎస్టి అమలు 4.52 ఇతర సమస్యలు 23.30 శాతం అని చెప్పారు.  
సంబంధిత చిత్రం
అల్పసంఖ్యాక వర్గాల్లో అభద్రతా భావం ఎక్కువైందా అన్నదానికి కాదు అని 65.51, అవును అని 24.26, చెప్పలేం అని 10.24 శాతం అభిప్రాయపడ్దారు. 


అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కలిపిస్తే బిజెపికి లాభిస్తుందా అన్న ప్రశ్నకు అవును అని 72.66, కాదు అని 15.25, చెప్పలేం అని 12.10 శాతం అభిప్రాయపడ్డారు. 


రాఫెల్ వివాదం ఎన్ డీఏ ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందా అన్నదానికి కాదు అని 74.59 అవును అని 17.51 చెప్పలేం అని 7.90 శాతం అభిప్రాయం వెలిబుచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: